Sun Mars Conjunction 2023: సింహరాశిలో కుజుడు-సూర్యుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

Surya Gochar 2023: వచ్చే నెలలో కొన్ని కీలక గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. గ్రహాల రాజు అయిన సూర్యుడు తన రాశిని మార్చి సింహరాశిలో కుజుడుతో కలవనున్నాడు. వీరిద్దరి సంయోగం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 14, 2023, 04:24 PM IST
Sun Mars Conjunction 2023: సింహరాశిలో కుజుడు-సూర్యుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

Sun Mars Conjunction 2023 in leo:  ఆస్ట్రాలజీ ప్రకారం, గ్రహాల కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. కొన్ని గ్రహాలు రాశిని మార్చడానికి తక్కువ సమయం తీసుకుంటే.. మరికొన్ని ఎక్కువ సమయం తీసుకుంటాయి. కొన్నిసార్లు రెండు లేదా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలిసి ఉంటాయి. దీనినే యుతి అంటారు. గ్రహాల రాజైన సూర్యదేవుడు ప్రతి నెలా రాశిని మారుస్తాడు. వచ్చే నెల 17న సూర్యభగవానుడు సింహరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అప్పటికే అదే రాశిలో కుజుడు కూర్చుని ఉంటాడు. వీరి ఇద్దరి కలయిక వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మేషం
మేషరాశి వారికి కుజుడు-సూర్యుడు సంయోగం చాలా ప్రయోజనాలను ఇస్తుంది. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీకు ఆకస్మిక ధనలాభం  ఉంటుంది. మీ లవ్ లైవ్ బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. 
కర్కాటకం
సూర్యుడు మరియు కుజుడు కలయిక కర్కాటక రాశి వారికి లాభాలను ఇస్తుంది. మీ ఆదాయం పెరుగుతుంది. పెద్ద మెుత్తంలో డబ్బు మీకు అందుతుంది. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. 

Also Read: Sun transit 2023: మరో 3 రోజుల్లో కర్కాటక రాశిలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..!

సింహం
కుజుడు మరియు సూర్యుని మైత్రి ఇదే రాశిలో జరగనుంది. దీని కారణంగా మీలో  ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ కూడా లభిస్తుంది. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

Also Read: Venus retrograde 2023: జూలై 23న కీలక పరిణామం.. ఈ 5 రాశులవారికి గుడ్ టైమ్ స్టార్ట్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News