Muslim Personal Law Board on UCC: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. అంతకంటే ముందు యూసీసీ అమలుకు అడ్డంకులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మరోవైపు యూనిఫామ్ సివిల్ కోడ్ గిరిజనులకు, మైనారిటీలకు అన్యాయం చేస్తోందని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (AIMPLB) స్పందించింది. యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై తన అభ్యంతరాలను లా కమిషన్‌కు పంపింది. గిరిజనులు, మతపరమైన మైనారిటీలను ఈ చట్టం నుంచి మినహాయింపు ఉంచాలని ముస్లిం లా బోర్డు డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రకటనలో బోర్డు తన వైఖరిని స్పష్టం చేసింది. దేశంలోని వైవిధ్యాన్ని కాపాడుకోవాలని.. మైనారిటీలు, గిరిజన వర్గాలను వారి సొంత వ్యక్తిగత చట్టాల ద్వారా పరిపాలించడానికి అనుమతిస్తేనే జాతీయ సమగ్రత, భద్రత, సౌభ్రాతృత్వం ఉత్తమంగా నిర్వహించినట్లవుతుందని బోర్డు కార్యాలయ కార్యదర్శి మహ్మద్ వక్రూద్దీన్ తెలిపారు. బోర్డు వర్చువల్ జనరల్ మీటింగ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చించినట్లు బోర్డు అధికార ప్రతినిధి కాసిం రసూల్ ఇలియాస్ తెలిపారు. దీనిపై తాము నివేదికను తయారు చేసి ఏకగ్రీవంగా అంగీకరించామని.. అనంతరం లా కమిషన్‌కు పంపామని చెప్పారు.
యూసీసీపై తమ అభ్యంతరాలను దాఖలు చేసేందుకు వివిధ పార్టీలు, ఇతర బోర్డులు, కమిటీలకు లా కమిషన్ జూలై 14 వరకు సమయం ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆరు నెలల సమయం పొడిగించాలని గతంలోనే ఏఐఎంపీఎల్‌బీ అభ్యర్థించింది. జూన్ 27న జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో యూసీసీపై రూపొందించిన ముసాయిదా ప్రతిస్పందనను బోర్డు వర్కింగ్ కమిటీ ఆమోదించింది. బుధవారం లా కమిషన్‌కు పంపించింది.
All India Muslim Personal Law Board has submitted a draft opposing Uniform Civil Code to Law Commission pic.twitter.com/dvWEmQRrPN
— ANI (@ANI) July 5, 2023
ముస్లింల వ్యక్తిగత ఆచారాలు నేరుగా పవిత్ర ఖురాన్, ఇస్లామిక్ చట్టాల నుంచి ఉద్భవించాయని.. ఈ అంశం ముస్లింల గుర్తింపుతో ముడిపడి ఉందని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. భారతదేశంలోని ముస్లింలు రాజ్యాంగంలో ఉన్న ఈ గుర్తింపును కోల్పోవటానికి అంగీకరించరని ప్రకటనలో పేర్కొంది. సమస్య పూర్తిగా చట్టబద్ధమైనా.. రాజకీయాలకు, మీడియాకు యూసీసీ అంశం విస్తృత ప్రచార అంశంగా మారిందని తెలిపింది. యూసీసీ చట్టం అవసరమా..? లేదా..? అని కమిషన్ మాజీ సభ్యులు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారని ప్రకటనలో గుర్తుచేసింది. కమిషన్ ఏమి చేయాలనుకుంటున్నదో ఎలాంటి బ్లూప్రింట్ లేకుండా.. ప్రజల అభిప్రాయాన్ని కోరడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొంది. ఇప్పటికే ఉన్న పౌర చట్టాలను విశ్లేషించినట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు వెల్లడించింది.
Also Read: IND Vs WI T20 Squad: టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు
Also Read: Salaar Teaser: సలార్ టీజర్ వచ్చేసింది.. పవర్‌ఫుల్ లుక్‌లో ప్రభాస్.. గూస్‌బంప్స్ పక్కా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి