Top 10 Valuable Banks in World: ప్రపంచంలోనే టాప్ 10 బ్యాంకులు.. మన దేశం నుంచి ఏ బ్యాంక్ ఉందంటే..

Top 10 Valuable Banks in World: ఒక బ్యాంకుకి ఒక్క దేశంలో బిజినెస్ చేయడం అంటేనే ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశం. బిజినెస్ పరంగా, లాభాలు పరంగా ఒక్క అడుగు ముందుకేస్తే.. మరెన్నో ప్రతికూల అంశాలు ఆ బ్యాంకుల్ని కాలర్ పట్టి వెనక్కి లాగుతుంటాయి. అంత పోటీ ఉన్న ఈ పోటీ ప్రపంచంలో కొన్ని బ్యాంకులు ప్రపంచ దేశాల్లో తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించడమే కాకుండా ఒకదానితో మరొకటి పోటీ పడుతున్నాయి. అలా పోటీ పడుతున్న టాప్ 10 బ్యాంకులు ఏంటి ?, మన ఇండియా నుంచి ఏ బ్యాంకుకు ఆ జాబితాలో చోటు లభించిందో ఇప్పుడు చూద్దాం రండి.

Written by - Pavan | Last Updated : Jul 2, 2023, 10:04 AM IST
Top 10 Valuable Banks in World: ప్రపంచంలోనే టాప్ 10 బ్యాంకులు.. మన దేశం నుంచి ఏ బ్యాంక్ ఉందంటే..

Top 10 Valuable Banks in World: జేపీ మోర్గాన్ చేజ్ : 
జేపీ మోర్గాన్ చేజ్ బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టార్‌లో ప్రపంచంలోనే అగ్రగామిగా దూసుకుపోతోంది. వీళ్లకు ప్రపంచవ్యాప్తంగా బ్రాంచీలు ఉండటంతో పాటు స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఎన్నో పెద్ద పెద్ద పరిశ్రమలు, కంపెనీలకు వీళ్లు భారీ మొత్తంలో రుణాలు మంజూరు చేస్తూ తమ వ్యాపార కార్యకలాపాలను మరింత పెంచుకుంటున్నారు. 

ఐసిబిసి : 
ఐసిబిసి బ్యాంక్ పూర్తి పేరు.. ఇండస్ట్రియల్ అండ్ కమెర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా. చైనాకు చెందిన ఈ బ్యాంక్ ప్రపంచంలోనే పేరున్న బ్యాంకు. చైనా జనాభాలోనే కాకుండా వాణిజ్య రంగంలోనూ తోపే. అందులోనూ చైనా బ్యాంకింగ్ సెక్టార్‌కి కూడా బాగా పేరుంది. చైనా కేంద్రంగా ఆపరేట్ అవుతున్న ఈ బ్యాంకుకి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు ఉన్నాయి. 

బ్యాంక్ ఆఫ్ అమెరికా : 
బ్యాంక్ ఆఫ్ అమెరికా అనే పేరులోనే అమెరికా ఉంది. అంటే ఈ బ్యాంకు అమెరికాకు చెందినది అని ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఓనర్ మరెవరో కాదు.. బర్క్‌షైర్ హ్యాత్‌వే కంపెనీ.. అంటే వారెన్ బఫెట్ యజమానిగా ఉన్న కంపెనీ అన్నమాట.  

హెచ్ డి ఎఫ్ సి : 
హెచ్ డి ఎఫ్ సి లిమిటెడ్ తో మర్జర్ తరువాత హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ ప్రపంచంలోనే అత్యంత అధిక విలువ కలిగిన బ్యాంకుల్లో 4వ స్థానానికి ఎగబాకింది.

అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా : 
చైనా సెంట్రల్ గవర్నమెంట్‌కి చెందిన నాలుగు బ్యాంకులలో అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఒకటి. వ్యవసాయంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రజల ఆర్థిక వ్యవహారాలలో చేయూతను అందించడానికి ఈ అగ్రికల్చరల్ బ్యాంక్ ఆఫ్ చైనా ముందు ఉంటుంది. 

చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంక్ : 
చైనాకు చెందిన ఈ బ్యాంక్ లండన్ కేంద్రంగా పనిచేస్తూ ప్రపంచవ్యాప్తంగా తమ కస్టమర్లకు సేవలు అందిస్తోంది. రీటేల్ లోన్స్, కమెర్షియల్ లోన్స్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సేవల్లో చైనా కన్‌స్ట్రక్షన్ బ్యాంకు సేవలు అందిస్తోంది.

హెచ్ఎస్‌బీసీ : 
లండన్ కేంద్రంగా సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు రీటేల్ బ్యాంకింగ్, కమెర్షియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో సేవలు అందిస్తోంది. 

వెల్స్ ఫార్గో : 
అమెరికాకు చెందిన బ్యాంకుల్లో వెల్స్ ఫార్గో బ్యాంక్ కూడా ఒకటి. బ్యాంకింగ్, మార్టగేజ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ కస్టమర్లకు విశిష్ట సేవలు అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్యాంకుకు కస్టమర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు, కంపెనీలు కూడా ఈ బ్యాంకుకి కస్టమర్లుగా కొనసాగుతున్నారు. 

బ్యాంక్ ఆఫ్ చైనా : 
చైనాలోనే అతి ప్రాచీనమైన, అతి పెద్ద బ్యాంకుల్లో ఈ బ్యాంక్ ఆఫ్ చైనా కూడా ఒకటి. చైనాతో పాటు దేశవిదేశాల్లో ఈ బ్యాంక్ ఆఫ్ చైనా బ్యాంకింగ్ సెక్టార్లో సేవలు అందిస్తోంది.

మోర్గాన్ స్టాన్లీ : 
మోర్గాన్ స్టాన్లీ ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి రంగాల్లో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా వెల్త్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, సేల్స్ అండ్ ట్రేడింగ్‌లో మోర్గాన్ స్టాన్లీ విశిష్ట సేవలు అందిస్తోన్న విషయం తెలిసిందే.

Trending News