IRCTC Retiring Room: 100 రూపాయలకే లగ్జరీ రూమ్.. ఎలా బుక్ చేసుకోవాంటే..?

How to Book Retiring Room in IRCTC: రైల్వే స్టేషన్‌లో తక్కువ ధరకే హోటల్ తరహా రూమ్‌లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. ప్రయాణికులు రాత్రివేళ బస చేసేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ఎలా బుక్ చేసుకోవాలంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 2, 2023, 07:58 AM IST
IRCTC Retiring Room: 100 రూపాయలకే లగ్జరీ రూమ్.. ఎలా బుక్ చేసుకోవాంటే..?

How to Book Retiring Room in IRCTC: ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ అనేక సదుపాయలను అందుబాటలోకి తీసుకువచ్చింది. ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఈ క్రమంలో తక్కువ ధరకే రైల్వే స్టేషన్‌లో రూమ్‌లను అందిస్తోంది. రైలు ఆలస్యమైనప్పుదు.. పొద్దున రైలు ఉందనగా రాత్రివేళ ఎక్కడ ఉండాలో తెలియని సమయంలో.. ఇతర సమయాల్లో మీకు రూమ్‌లు అవసరం అవుతాయి. మీరు ఏ హోటల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా అతి తక్కువ ధరకే రైల్వేస్టేషన్‌లోనే రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి.  

రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు బస చేసేందుకు హోటల్ తరహాలోనే గదులు ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. ఏసీతోపాటు బెడ్, ఇతర అవసరమైన వస్తువులు రూమ్‌లోనే ఉంటాయి. రాత్రివేళ రూమ్‌ను బుక్ చేసుకోవడానికి రూ.100 నుంచి రూ.700 వరకు చెల్లించాల్సి రావచ్చు. రైల్వే స్టేషన్‌లో రూమ్ బుక్ చేసుకోవడం ద్వారా బయట హోటళ్లకు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇలా బుక్ చేసుకోండి..
==> ముందుగా మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్‌ను ఓపెన్ చేయండి
==> లాగిన్ చేసిన తరువాత మై బుకింగ్‌కి వెళ్లండి
==> టికెట్ కింద రిటైరింగ్ రూమ్ ఆప్షన్ కనిపిస్తుంది
==> ఇక్కడ క్లిక్ చేసిన అనంతరం మీకు రూమ్ బుక్ చేసుకునే ఆప్షన్ కనిపిస్తుంది 
==> కొంత వ్యక్తిగత సమాచారం, ప్రయాణ సమాచారాన్ని ఎంటర్ చేయండి
==> పేమెంట్ తరువాత మీ రూమ్ బుక్ అవుతుంది

Also Read: World Cup 2023 Venues Controversy: వరల్డ్ కప్ వేదికల ఎంపికపై తీవ్ర దుమారం.. పంజాబ్ స్పోర్ట్స్ మంత్రి ఫైర్   

Also Read: Twitter Limit: ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఎలన్ మస్క్ సంచలన నిర్ణయం  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News