Jio Annual Plan: భారతదేశ వ్యాప్తంగా జియో టెలికాం రంగంలో పరుగులు పెడుతున్న సంగతి అందిరికీ తెలిసిందే. రిలయన్స్ జియో తన కస్టమర్లకు పెరుగుతున్న డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. ఈ ఫ్లాన్‌ను ఎంచుకునేవారు రోజువారీ డేటా భాగంగా భాగంగా ఎక్కువ డేటాను పొందే అవకాశాలున్నాయి. అంతేకాకుండా అన్ని రకాల డిజిటల్ కనెక్టివిటీ సేవలను కూడా మీరు ఈ ఫ్లాన్‌లో పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ. 2999 ప్లాన్‌లను చాలా మంది కస్టమర్లు వినియోగిస్తున్నారు. అయితే మీకు తెలియని వార్షిక రీఛార్జ్ ప్లాన్‌లు కూడా ఉన్నాయి. ఆ ప్లాన్స్ ఏంటో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రూ. 2999 గల అన్యువల్ ప్లాన్:
రిలయన్స్ జియో రూ. 2999 గల అన్యువల్ ప్లాన్‌ను గత సంవత్సరం నుంచి అందిస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా మీరు బ్రౌజింగ్, స్ట్రీమింగ్ చేసుకునే విధంగా 2.5GB రోజువారీ డేటాను పొందవచ్చు. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాల్స్‌లో పాటు హై స్పీడ్ డేటా కూడా లభిస్తుంది. ప్రతి రోజు 100 SMSలను కూడా పొందుతారు. ఈ ప్లాన్‌లో మీ ఇంత వరకు ఎప్పుడు పొందని 75GB బోనస్ డేటా కూడా లభిస్తుంది. మరిన్ని వివరాల కోసం మీరు మై జియో యాప్‌ను సందర్శించాల్సి ఉంటుంది.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
రూ.2879 వార్షిక ప్లాన్:
జియో రూ.2879 వార్షిక ప్లాన్ ద్వారా అదనంగా 23 రోజుల డేటా ప్లాన్‌ను కూడా పొందవచ్చు. ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లు అదనంగా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ప్రస్తుతం ఇది పరిమితి 2GB డేటాతో అందుబాటులో ఉంది. ఈ అన్యువల్ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ పొందడమే కాకుండా రోజుకు 100 SMSలు కూడా లభిస్తాయి. రూ. 2999 వార్షిక ప్లాన్‌తో పాటు ఈ ప్లాన్ ద్వారా కూడా JioCinema, JioTV, JioCloud, JioSecurity వంటి జియో డిజిటల్ సేవలకు యాక్సెస్ లభిస్తుంది.
ఈ అన్యువల్ ప్లాన్ ద్వారా JioCinema, JioTV ద్వారా ప్రసారాలను ఉచితంగా వీక్షించడమేకాకుండా జియో క్లౌడ్‌లో డేటా సేప్ ఆప్షన్ కూడా పొందవచ్చు. ఈ వార్షిక ప్లాన్‌లకు సబ్‌స్క్రయిబ్ చేసే కస్టమర్‌లు జియో 5G వెల్‌కమ్ ఆఫర్‌కు కూడా ఆర్హత పొందుతారు. దీంతో పాటు చాలా రకాల కొత్త ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook