White Hair Solution: ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందిలో జుట్టు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాలు తగ్గి జుట్టు రాలడం, తెల్ల జుట్టు సమస్యల బారిన పడుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా జుట్టు పై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. లేకపోతే జుట్టు పూర్తిగా రాలిపోయి బట్టతల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరికొందరైతే జుట్టును సంరక్షించుకునేందుకు మార్కెట్లో లభించే రసాయనాలతో కూడిన ఖరీదైన ప్రోడక్ట్లను వినియోగిస్తున్నారు. వీటిని వినియోగించినప్పటికీ ఎలాంటి ఫలితాలు పొందలేకపోతున్నారని వారంటున్నారు. అయితే ప్రతిరోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు హోం రెమెడీస్ ని వినియోగించడం వల్ల జుట్టు రాలడాన్ని తెల్ల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా విముక్తి కలిగించే హోం రెమెడీస్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..
ఉసిరిలో చాలా రకాల ఆయుర్వేద గుణాలు లభిస్తాయి. అందుకే మధుమేహంతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా ఈ రసాన్ని తాగుతూ ఉంటారు. ఈ రసం తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి రసం శరీరానికే కాకుండా జుట్టుకు కూడా ప్రభావంతంగా సహాయపడుతుందని వారంటున్నారు. ఉసిరి రసాన్ని జుట్టుకి ఎలా వినియోగించాలో ఇప్పుడు చూద్దాం.
ఉసిరి రసాన్ని జుట్టుకు అప్లై చేసే ముందు తప్పకుండా ఇందులో కొన్ని పదార్థాలను మిక్స్ చేయాల్సి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ రసాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక చిన్న కప్పు ఉసిరి రసం వేసుకోవాలి. ఈ రసంలోనే రోస్ మేరీ ఆకులతో తయారుచేసిన రసం, ఒక కప్పు బీట్‌రూట్ రసాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న రసాన్ని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల తెల్ల జుట్టు జుట్టు రాలడం సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రసంలో ఉండే మూలకాలు జుట్టును కుదుళ్ల నుంచి కూడా దృఢంగా చేస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
White Hair: ఎంత ఖరీదైన ప్రొడక్ట్స్ వినియోగించిన జుట్టు రాలడం, తెల్ల జుట్టు తగ్గడం లేదా? నయా పైసా ఖర్చు లేకుండా చెక్ పెట్టొచ్చు..