Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్

Sarfaraz Khan Counter to BCCI: దేశవాళీ టోర్నీల్లో సూపర్ పర్ఫామెన్స్ చేసిన సర్ఫరాజ్ ఖాన్‌ను టీమిండియాకు ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ భారీ ట్రోలింగ్ జరుగుతోంది. మాజీలు, క్రికెట్ అభిమానులు ఇలా ప్రతి ఒక్కరు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా సర్ఫరాజ్ కూడా రియాక్ట్ అయ్యాడు.   

Written by - Ashok Krindinti | Last Updated : Jun 25, 2023, 07:38 AM IST
Sarfaraz Khan: ఒక్క వీడియోతో బీసీసీఐకి ఇచ్చిపడేసిన సర్ఫరాజ్ ఖాన్

Sarfaraz Khan Counter to BCCI: విండీస్ పర్యటనకు జట్టు ఎంపికపై పెద్ద దూమరమే రేగుతోంది. రంజీ ట్రోఫీలో గత మూడేళ్లుగా నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై మాజీలు, క్రికెట్ నిపుణులు, అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఐపీఎల్ పర్ఫామెన్స్ ఆధారంగా టెస్ట్ టీమ్‌ను ఎలా ఎంపిక చేస్తారంటూ బీసీసీఐ సెలక్షన్‌ కమిటీని నిలదీస్తున్నారు. అలాంటప్పుడు దేశవాళీ టోర్నీలు ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. సునీల్ గవాస్కర్, వసీం జాఫర్‌లతో సహా పలువురు మాజీ క్రికెటర్లు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ముఖేష్ కుమార్ వంటి యువకుల్ఉ

తాజాగా సర్ఫరాజ్‌ ఖాన్‌కు కూడా స్వయంగా బీసీసీఐకి కౌంటర్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పంచుకున్నాడు ఈ భారత బ్రాడ్‌మన్. ఈ వీడియోలో తాను ఆడిన రంజీ ట్రోఫీ సీజన్ హైలైట్స్ ఉన్నాయి. ఈ స్టోరీకి క్యాప్షన్‌ ఏమి రాయలేదు. కానీ బీసీసీఐ సెలక్టర్లకు తన బ్యాటింగ్ వీడియో చూడమని కౌంటర్ ఇచ్చాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. గతేడాది బంగ్లాదేశ్ పర్యటనకు సర్ఫరాజ్‌ను ఎంపిక చేస్తారని అంతా భావించారు. అప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఆ తరువాత ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు కూడా పట్టించుకోలేదు. జూలై 12వ నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ సిరీస్‌కు కూడా ఈ యంగ్ బ్యాట్స్‌మెన్‌కు సెలక్టర్లు మొండి చేయి చూపారు. 

25 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ టోర్నీల్లో నిలకడగా పరుగులు సాధిస్తున్నాడు. 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దాదాపు 80 సగటుతో 3505 పరుగులు చేశాడు. ఇందులో  13 సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. సర్ఫరాజ్ అత్యధిక స్కోరు 301 నాటౌట్. దేశవాళీ టోర్నీల్లో మరే క్రికెటర్‌కు ఈ రికార్డులు లేవు. అయినా సర్ఫరాజ్ ఖాన్‌ను సెలక్టర్లు పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. 2022–23 రంజీ ట్రోఫీలో 92.66 సగటుతో ఆరు మ్యాచ్‌ల్లో 556 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. 2021–22 రంజీ సీజన్‌లో 122.75 సగటుతో 982 రన్స్ చేశాడు.  

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవించంద్రన్ అశ్విన్ , రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ.

Also Read: Dalit Bandhu Phase 2: దళిత బంధు రెండో విడతకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  

Also Read: CM KCR: సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్.. పోడు భూముల పట్టాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News