Retrieve Your Money Back: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపిస్తే..? తిరిగి పొందాలంటే..?

Retrieve Your Money Back: ఆన్‌లైన్ చెల్లింపులు లేదా డిజిటల్ పేమెంట్ విధానం అమల్లో వచ్చిన తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ సులభమైపోయింది. ఇంట్లో కూర్చుని సెకన్లలో నగదు బదిలీ చేయగలుగుతున్నారు. అదే సమయంలో ఏ చిన్న పొరపాటైనా మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2023, 08:30 PM IST
Retrieve Your Money Back: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపిస్తే..? తిరిగి పొందాలంటే..?

Retrieve Your Money Back: స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ చెల్లింపులు బ్యాంక్ సంబంధిత పనుల్ని సులభతరం చేశాయి. ఒక బ్యాంకు నుంచి మరో బ్యాంకుకు నగదు బదిలీ చేయడం క్షణాల్లో జరిగిపోతోంది. అయితే ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా ఒక ఎక్కౌంట్‌కు వెళ్లాల్సిన డబ్బు మరో ఎక్కౌంట్‌కు వెళ్లిపోగలదు. అదే జరిగితే ఇంక అంతేనా, ఏం చేయలేమా, ఆ డబ్పులు పోయినట్టేనా..వీటికి సమాధానమే ఇది..

డిజిటల్ పేమెంట్స్ లేదా ఆన్‌లైన్ చెల్లింపులు చేసేటప్పుడు పొరపాటున ఒకరి బదులు మరొకరికి పేమెంట్స్ లేదా నగదు బదిలీ జరిగే సందర్భాలు చాలానే ఉంటున్నాయి. ఒక ఎక్కౌంట్ నుంచి మరో ఎక్కౌంట్‌కు నగదు బదిలీ అనేది ఇప్పుడొక సాధారణ ప్రక్రియగా మారింది. గతంలో అయితే బ్యాంకుకు వెళ్లి అక్కడ క్యూలో నిలుచుని..సంబంధిత ఫామ్ నింపి ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడలా కాదు..క్షణాల్లో ఇంట్లోంచే స్మార్ట్‌ఫోన్ సహాయంతో లేదా ల్యాప్‌టాప్‌తో పని జరిగిపోతోంది. ఎక్కడ్నించి ఎక్కడికైనా నగదు బదిలీ అయిపోతోంది. అయితే ప్రతి సౌకర్యం లేదా సౌలభ్యం వెనుక పాజిటివ్, నెగెటివ్ రెండూ ఉంటాయి. ఒకవేళ పొరపాటున ఒకరికి పంపించాల్సిన డబ్బు మరొకరికి పంపిస్తే ఏం చేస్తారు, ఆ డబ్బు పోయినట్టేనా, ఇక తిరిగి రాదా అంటే ఎస్బీఐ ఈ ప్రశ్నలకు సమాధానమిస్తోంది. మీ డబ్బు మీరు తిరిగి పొందాలంటే ఏం చేయాలో వివరిస్తోంది. ఆ వివరాలు మీ కోసం..

Also Read: Mahindra Thar 5 Door: మారుతి జిమ్నీతో నువ్వా నేనా అనేందుకు సిద్ధమైన మహీంద్రా థార్ 5 డోర్, లాంచ్ ఎప్పుడంటే

దీనికి సంబంధించి ఓ నెటిజన్ ట్విట్టర్ సాక్షిగా తాను ఎదుర్కొన్న ఇలాంటి సమస్య గురించి ప్రస్తావించాడు. సంబంధిత బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు నమోదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, తన డబ్బు తిరిగి రాలేదనేది అతడి సమస్య. దీనికి సమాధానంగా పొరపాటున మరో ఎక్కౌంట్‌కు డబ్బులు బదిలీ అయితే ఏ చేయాలో ఎస్బీఐ సూచించింది. నగదు బదిలీ చేసే ప్రక్రియలో పొరపాటున తప్పు ఎక్కౌంట్ నెంబర్ నమోదు చేస్తే..వెంటనే సంబంధిత బ్రాంచ్‌ను సంప్రదించాలి. తగిన చర్యల్ని సంబంధిత బ్యాంకు చేపడుతుంది. కస్టమర్ ఫిర్యాదు చేసిన రాంగ్ ఎక్కౌంట్ నెంబర్ లబ్దిదారుడి బ్యాంకును ఈ బ్యాంకు సంప్రదించి, తగిన చర్యలు చేపడుతుందని వెల్లడించింది.

ఒకవేళ సంబంధిత బ్యాంక్ బ్రాంచ్‌లో సమస్య పరిష్కారం కాకపోతే ఆ కస్టమర్ https://crcf.sbi.co.in/ccfunder Personal segment/ సైట్‌లో వెళ్లి ఫిర్యాదు నమోదు చేయవచ్చు. కామెంట్ బాక్స్‌లో మీ ఫిర్యాదు ఎంటర్ చేయాలి. ముందుగా ఇండివిడ్యువల్ కస్టమర్ కేటగరీలో వెళ్లి..అక్కడి నుంచి జనరల్ బ్యాంకింగ్, బ్రాంచ్ రిలేటెడ్ కేటగరీలో వెళ్లాలి. ఇప్పుడు మీ గ్రీవెన్స్ నమోదు చేస్తే సంబంధిత టీమ్ మీ సమస్యను పరిష్కరిస్తుందని ఎస్బీఐ సూచించింది. 

Also read: Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, డీఏ 4 శాతం పెంచుతూ నిర్ణయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News