Telangana Group-4 Hall Tickets will be Available from Today: జూలై 01న జరగనున్న గ్రూప్-4 పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లును ఇవాల్టి (జూన్ 24) నుంచి అందుబాటులో ఉంచనుంది టీఎస్పీఎస్సీ. జులై 1న పేపర్-1 పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ తెలిపారు.
వచ్చే నెల 01న నిర్వహించనున్న గ్రూప్-4 ఎగ్జామ్ లో అభ్యర్థుల వేలిముద్రల్ని టీఎస్పీఎస్సీ తప్పనిసరి చేయనుంది. పేపర్-1, పేపర్-2 పరీక్షల్లో అభ్యర్థుల వేలిముద్రలు తీసుకున్న తరువాతే ఓఎంఆర్ పత్రాల్ని ఇస్తారు. ఈ పరీక్ష నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది టీఎస్పీఎస్సీ. 8,180 గ్రూప్-4 పోస్టులకు సంబంధించి 9.51 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఈ పరీక్ష ఏర్పాట్లు గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాలు నిర్వహించింది. ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించేటప్పుడు హాల్‌టికెట్‌తో పాటు తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డును పరిశీలించనున్నారు.
గతేడాది నిర్వహించిన గ్రూప్-1 పరీక్షలో బయోమెట్రిక్ అమలు చేశారు. కానీ ఆ ఎగ్జామ్ కు సంబంధించి చాలా మంది అభ్యర్థుల బయోమెట్రిక్‌ను తీసుకోలేకపోయారు. కొందరు పరీక్ష కేంద్రానికి ఆలస్యంగా రావడం, పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి బయోమెట్రిక్ తీసుకోలేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఉండేందుకు.. అభ్యర్థి గుర్తింపు కార్డు, ముఖాన్ని సరిచూసి సంతకం, వేలిముద్ర తీసుకోనున్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Rain Alert: ఇవాళ, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook