How To Reduce Uric Acid: శరీరంలో అతిగా యూరిక్ యాసిడ్ పెరగడం కారణంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా యాసిడ్ కారణంగా కీళ్ల నొప్పుల సమస్యలు వస్తూ ఉంటాయి. చాలామందిలో ఈ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు.. ఊపిరితిత్తుల్లో సమస్యలు ఏర్పడి శరీరంలో పేరుకుపోయిన ప్యూరిన్ ఫిల్టర్ కాకపోవడం కారణంగా మోకాళ్లు, కీళ్లలో యూరిక్ యాసిడ్ పేరుకు పోతాయి. దీని కారణంగా మోకాళ్ళ నొప్పుల సమస్యలతో పాటు తీవ్ర కీళ్ల నొప్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ కీళ్ల నొప్పులతో బాధపడేవారు తప్పకుండా ఆహారాన్ని డైట్ పద్ధతిలో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఊబకాయాన్ని కూడా నియంత్రించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బరువు పెరగడం కారణంగా మందిలో యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తున్నాయని ఇటీవలే పరిశోధనలో తేలింది. కాబట్టి ఎంత వీలైతే అంత శరీర బరువును తగ్గించుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పుదీనాతో తయారుచేసిన రసాన్ని తాగడం వల్ల కూడా ఈ కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. అయితే ఈ రసాన్ని ఎలా తయారు చేసుకోవాలో?, ఎలా తాగాలో? మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
పుదీనాలో ఐరన్ పొటాషియం, మాంగనీస్, అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనితో తయారుచేసిన రసాన్ని ప్రతిరోజు తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. ఈ రసం తాగడం వల్ల శరీర బరువు కూడా తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని కూడా నిర్వీకరణ చేస్తాయి. కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు.
పుదీనా రసాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో పుదీనా ఆకులు తీసుకుని వాటిని బాగా నీటితో కడగాలి. ఆ తర్వాత వీటిని మిక్సర్ లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిలా ఉండగానే అందులో నిమ్మరసం కలుపుకొని, తగినంత రాక్ సాల్ట్ వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. తయారు చేసుకున్న రసాన్ని గ్లాసులోకి తీసుకొని పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి తాగితే.. శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also read : Pawan Kalyan Comments: నన్ను వదిలేస్తే ముస్లింలకే నష్టం, కాకినాడలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook