How To Earn More Money on Youtube Shorts: యూట్యూబ్ షార్ట్స్ ద్వారా డబ్బు సంపాదించ వచ్చు అని చాలా మందికి తెలుసు. యూట్యూబ్ లో షార్ట్స్ పోస్ట్ చేసి, తద్వారా వచ్చే ఆదాయంలో తాము కార్లు కొనుక్కున్నాం.. ఖరీదైన బంగ్లాలు కొనుకున్నాం అని ఫేమస్ యూట్యూబర్స్ చెబుతున్నప్పుడు అలా మనం ఎందుకు సంపాదించలేం అని ఆవేశంలో వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్లు కూడా ఉంటారు. కానీ ఏం చేస్తే.. ఎలా చేస్తే.. ఎక్కువ ఆదాయం వస్తుంది అనే విషయం తెలియక చాలా సమయం వృధా చేసి తాము ఫెయిల్ అయ్యామే అని మధన పడుతుంటారు.
అలా యూట్యూబ్ ఛానెల్ ద్వారా డబ్బులు సంపాదించాలి అని ప్లాన్ చేసుకునే వారి కోసమే ఈ సింపుల్ ట్రిక్స్. ఆ సింపుల్ ట్రిక్స్ ఏంటో తెలిస్తే.. మీరు అనుకున్నట్టుగానే యూట్యూబ్‌లో షార్ట్ వీడియోలు పోస్ట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది.
వివాదాస్పద అంశాల విషయంలో జాగ్రత్త వహించాలి..
యూట్యూబ్ షార్ట్స్ లో వివాదాస్పద అంశాలు ఉండే వీడియోలను అప్‌లోడ్ చేయకూడదు. అలా చేయడం వల్ల మీ ఛానెల్ కి యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం ఆగిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనుసరించే వారికి మాత్రమే యూట్యూబ్ ఆదాయం అందిస్తుంది. యూట్యూబ్ స్టాండర్డ్ పాలసీ పాటించకుండా మీ ఇష్టం వచ్చిన షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తే ఆదాయం రావడం ఆగిపోతుంది. మీ ఛానెల్లో అదే పనిగా వివాదాస్పద వీడియోలు పోస్ట్ అవుతున్నట్టయితే.. మీ ఛానెల్ మానిటైజేషన్ సైతం ఆగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. మొత్తం ఛానెల్ సైతం ఇబ్బందుల్లో పడుతుంది.
షార్ట్ వీడియో నిడివి విషయంలో పాటించాల్సినవి..
మీరు పోస్ట్ చేసే షార్ట్ వీడియో నిడివి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు షార్ట్ వీడియోల నుండి అధిక మొత్తంలో సంపాదించాలి అని అనుకున్నట్టయితే.. ఎప్పుడూ 60 సెకన్లకు తగ్గకుండా మీ షార్ట్ వీడియో ఉండేలా చూసుకోండి. ఇంతకంటే తక్కువ సమయంలో ఉన్న షార్ట్స్ వీడియోలకు మంచి రీచ్ లభించదు. అలాంటప్పుడు మీరు పోస్ట్ చేసే వీడియోలకు ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం ఉండదు.
ప్రతిరోజూ వీడియోలను పోస్ట్ చేయండి
యూట్యూబ్ లో షార్ట్స్ పోస్ట్ చేసే వారు క్రమం తప్పకుండా రోజూ షార్ట్స్ పోస్ట్ చేస్తూ ఉండాలి. నిత్యం నెటిజెన్స్ కి దగ్గరిగా ఉండాలి. అప్పుడే మీ వీడియోలకు బాగా రీచ్ పెరిగి మీరు పోస్ట్ చేసే వీడియోలకు భారీ స్పందల లభిస్తుంది. అప్పుడు మీరు పోస్ట్ చేసిన షార్ట్స్ కి ఆదాయం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది.
గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ ఉపయోగించండి
చూడ్డానికి ఫ్లాట్‌గా, ప్లెయిన్‌గా ఉండే వీడియోలను నెటిజెన్స్ ఎక్కువగా ఇష్టపడరు. అలా కాకుండా మీ వీడియోలో అక్కడక్కడా తగిన రీతిలో గ్రాఫిక్స్ ఉపయోగిస్తే.. వాటికి ఎక్కువ రెస్పాన్స్ లభిస్తుంది. ఆ వీడియోలు నచ్చిన వారు మీ ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయడం మొదలుపెడతారు. తద్వారా మీ వీడియోలకు రెగ్యులర్ వ్యూయర్స్ కూడా లభిస్తారు.
ఇది కూడా చదవండి : Maruti Suzuki Alto Tour H1: మారుతి సుజుకి నుంచి మరో చీప్ అండ్ బెస్ట్ కారు
ఆసక్తిని పెంచే వీడియోలు
మీకు ఇష్టమైన అంశాలు ఎంచుకోవడం కాకుండా.. ఎక్కువ మంది జనం కనెక్ట్ అయ్యే అంశాలను ఎంచుకుని వీడియోలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఎందుకంటే మీ వీడియోలో ఉన్న అంశం నచ్చిన వారు.. వారు చూడటమే కాకుండా .. ఆ వీడియోను మరింత మందితో పంచుకుంటారు. తద్వారా మీకు ఎక్కువ వ్యూస్ రావడమే కాకుండా.. మీ వీడియోకు కొత్త ఆడియెన్స్ కూడా లభిస్తారు. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే మీ షార్ట్స్ ఫుల్ వైరల్ అవుతాయన్నమాట. ఇలాంటి టిప్స్ పాటించినట్టయితే.. మీ వీడియోలకు మీరు వద్దన్నా డబ్బు వచ్చిపడుతుంది.
ఇది కూడా చదవండి : Honda Dio H Smart Features: రూ. 70 వేల స్కూటర్.. కారు లాంటి సేఫ్టీ ఫీచర్స్..
ఇది కూడా చదవండి : Rs 500 Notes, Rs 1000 Notes: రూ. 500 నోట్ల రద్దు, రూ. 1000 నోట్ల రీ ఎంట్రీపై ఆర్బీఐ గవర్నర్ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , FacebooK