Girl Addicted to Mobile Gaming: ప్రస్తుతం మొబైల్ వాడకం ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వాళ్ల వరకు స్మార్ట్ వినియోగిస్తున్నారు. పిల్లలు అయితే ఫోన్‌లోనే మునిగి తేలుతున్నారు. ఫోన్ లేకపోతే క్షణం కూడా ఉండరు. ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతూ.. ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. తాజాగా 13 ఏళ్ల బాలిక ఆన్‌లైన్ గేమింగ్ మాయలో పడి.. 52,19,809 రూపాయలు పొగొట్టింది. తన తల్లి మొబైల్ తీసుకుని గేమ్ ఆడిన బాలిక.. బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేసింది. తల్లి బ్యాంక్ అకౌంట్‌ను చెక్ చేయగా.. రూ.5 మాత్రమే చూసి షాక్‌కు గురైంది. బాలిక తన తల్లి డెబిట్ కార్డును ఆన్‌లైన్ గేమ్‌ల కోసం ఉపయోగించి డబ్బులు పొగొట్టినట్లు గుర్తించింది.
సౌత్ చైనాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసగా మారినట్లు ఆ అమ్మాయి చదివే స్కూల్ టీచర్ అనుమానించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె మొబైల్ స్క్రీన్ సమయం చాలా ఎక్కువగా ఉందని టీచర్ గుర్తించింది. స్కూల్ టైమ్‌లో కూడా ఆ బాలిక ఫోన్‌లో గేమ్స్ ఆడుతోంది. బాలిక తల్లితో టీచర్ మాట్లాడి.. మీర్ చెక్ చేయండి అని చెప్పారు. మొబైల్ తీసుకుని తల్లి చెక్ చేయగా.. ఈ షాకింగ్ విషయం తెలిసింది.
డబ్బులు ఏమైయ్యాయని.. బాలికను తండ్రి అడిగితే.. ఆన్‌లైన్ గేమ్‌లు, గేమ్‌లో కొనుగోళ్లకు డబ్బు ఖర్చు చేసినట్లు చెప్పింది. తన స్నేహితుల కోసం రూ.11,61,590 విలువైన గేమ్‌లను కొనుగోలు చేసినట్లు బాలిక తెలిపింది. ఇంట్లో డెబిట్ కార్డ్ దొరికిందని.. దానిని తన స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసినట్లు బాలిక అంగీకరించింది. తన డెబిట్ కార్డ్ పాస్‌వర్డ్‌ను బాలిక తల్లి ముందుగానే ఆ అమ్మాయికి చెప్పింది. దీంతో బాలిక డెబిట్ కార్డును దుర్వినియోగం చేసి.. ఆన్‌లైన్ గేమింగ్ కోసం రూ.52 లక్షలు పోగొట్టింది.
అందుకే చిన్న పిల్లలకు మొబైల్ ఇచ్చేముందు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు. వారు సెల్ వాడేప్పుడు ఓ కన్నేసి ఉంచాలని.. ఎక్కువసేపు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. బాలిక తల్లిదండ్రులదే ఈ ఘటనకు తప్పు అని నెటిజన్లు అంటున్నారు. ముందు నుంచే జాగ్రత్తలు పాటించి ఉంటే.. ఇంత భారీ నష్టం జరిగేది కాదని చెబుతున్నారు. మెక్‌గిల్ విశ్వవిద్యాలయం గతేడాది నిర్వహించిన సర్వేలో చైనాలో స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువ మంది బానిసైనట్లు తేలింది. సౌదీ అరేబియా రెండో స్థానంలో, మలేషియా మూడో స్థానంలో ఉన్నాయి.
Also Read: MLA Alajangi Jogarao: వైసీపీ ఎమ్మెల్యేకు పాలాభిషేకం.. పల్లకిలో ఊరేగింపు.. ఎందుకంటే..?
Also Read: Ind VS Aus WTC Final 2023: మ్యాచ్ మధ్యలో అమ్మాయికి లిప్ కిస్.. నెట్టింట వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook