Health Benefits of Jackfruit: సీజన్ లో మాత్రమే లభించే పండ్లలో పనస ఒకటి. ఇది ఎంత పెద్దది ఉంటుందో అన్నే ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్లుతోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటి పిక్కలతో కూర కూడా వండుకోవచ్చు. ప్రస్తుతం ఈ పళ్లను ఆన్ లైన్ లో కూడా అమ్మడం మెుదలుపెట్టారు. పనస పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
పనస పండు ప్రయోజనాలు
** పనస పండు తినడం వల్ల బీపీ కంట్రోల్ లో ఉంటుంది. బీపీ ఉన్నవారు ఖచ్చితంగా ఈ ప్రూట్ ను తినండి.
** కంటి సమస్యలు ఉన్నవారు పనస పండు తినడం మంచిది. దీని వల్ల మీ చూపు మెరుగుపడుతుంది.
** చర్మ సమస్యలను దూరం చేయడంతోపాటు స్కిన్ నిగారింపు నివ్వడంలో పనస అద్భుతంగా పనిచేస్తుంది.
** పనస పండులో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాలను తొలగించి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
** జాక్ ఫ్రూట్ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. హెయిర్ గ్రోత్ ఉంటుంది. అంతేకాకుండా మీకు ముసలితనం త్వరగా రాదు.
** కడుపులో మంటతోపాటు అల్సర్లను తగ్గించడంలో పనస పండు సహాయపడుతుంది.
Also Read: Hair Pack Tips: మీ కేశాలు మరింత అందంగా, నిగనిగలాడాలంటే ఈ హోమ్ మేడ్ ప్యాక్ ట్రై చేయండి
** స్పెర్మ్ కౌంట్ ను పెంచడంలో జాక్ ఫ్రూట్ సూపర్ గా పనిచేస్తుంది. దీంతో మీకు త్వరగా సంతానప్రాప్తి కలుగుతుంది.
** పనస తొనలు తినడం వల్ల త్వరగా అరుగుదలకు వస్తుంది. ఇది ఆజీర్తి, మలబద్దకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
** ఐరన్ లోపం ఉన్నవారు ఈ పనస పండును తీసుకోవడం చాలా మంచిది. డయాబెటిస్ ను కూడా కంట్రోల్ చేస్తుంది.
** జాక్ ఫ్రూట్ లో యాంటీ యాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా నిరోధిస్తాయి.
** పనస పండులో ఉండే శరీరంలోని ఎముకలు గట్టిపడేలా చేస్తుంది. ఆస్తమా వంటి శ్వాసకోస వ్యాధులకు చెక్ పెడుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook