Adidas Launches New Indian Cricket Team Jersey: టీమిండియా కొత్త జెర్సీలో కనిపించనుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు మూడు ఫార్మాట్లకు సంబంధించిన జెర్సీలను ఆవిష్కరించారు. టీమిండియా కొత్త స్పాన్సర్ అడిడాస్ కంపెనీ ఆటగాళ్ల జెర్సీలను డిజైన్ చేసింది. ఐదేళ్లపాటు భారత జట్టుకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు అడిడాస్ కంపెనీ ఇటీవలె ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా టెస్టులు, వన్డేలు, టీ20లు ఫార్మాట్లకు ఆటగాళ్లు ధరించే జెర్సీలను అడిడాస్ ఆవిష్కరించింది. కొత్త జెర్సీని విడుదల చేసిన వీడియోను అడిడాస్ ఇండియా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. ఐకానిక్ మూమెంట్ అంటూ క్యాప్షన్‌లో ఇచ్చింది.
"ఐకానిక్ మూమెంట్.. ఒక ఐకానిక్ స్టేడియం. కొత్త టీమ్ ఇండియా జెర్సీని పరిచయం చేస్తున్నాం.." అంటూ అడిడాస్ రాసుకొచ్చింది. ముంబైలోని ఐకానిక్ వాంఖడే స్టేడియం నుంచి ఈ జెర్సీని రిలీజ్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ స్టేడియంలో టీమిండియా 2011 వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జెర్సీకి సంబంధించిన గ్లింప్స్‌ను విడుదల చేసిన అడిడాస్.. త్వరలోనే పూర్తిస్థాయి కిట్‌ను విడుదల చేయనుంది.
An iconic moment, An iconic stadium
Introducing the new team India Jersey's #adidasIndia #adidasteamindiajersey#adidasXBCCI @bcci pic.twitter.com/CeaAf57hbd— Adidas India (@adidasindiaoffi) June 1, 2023
జూన్ 7వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ ఆడుతోంది. ఇంగ్లాండ్‌లోని ఓవల్ మైదానంలో జరిగే ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌కు క్రికెట్ అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వరుసగా రెండోసారి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు చేరుకున్న భారత్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో ఉంది. గత ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైంది. ఈసారి ఫైనల్ మ్యాచ్‌లో కంగారూ జట్టును మట్టికరిపించి ట్రోఫీని సొంతం చేసుకోవాలని టీమిండియా అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Also Read: IND Vs Aus WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు హర్భజన్ టీమ్ ఇదే.. ఆ ప్లేయర్ జట్టులో ఉండాల్సిందే..!
ఈ ఫైనల్ మ్యాచ్‌కు భారత జట్టు ఆటగాళ్లు కొత్త జెర్సీలోనే బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే అడిడాస్ రూపొందించిన కొత్త కిట్‌లో ప్రాక్టీస్ కూడా షూర్ చేశారు. వన్డేలు, టీ20లకు కూడా వేర్వేరు జెర్సీలను రూపొందించారు. రెండు బ్లూ కలర్‌లోనే ఉన్నా.. కొంచెం డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. టెస్ట్‌లకు యాథావిధిగా వైట్ కలర్ జెర్సీని రూపొందించారు. భూజాలపై బ్లూలైన్స్ యాడ్ చేశారు. ఇది జెర్సీకి కొత్త లుక్‌ను తీసుకువచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook