Rice Water for Skin Benefits: రైస్ వాటర్‌లో అమినో యాసిడ్స్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ నీటిని వినియోగించడం వల్ల శరీరానికే కాకుండా చర్మానికి కూడా ప్రభావవంతంగా సహాయపడతాయి. ఈ రైస్ వాటర్ లో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ చర్మానికి వినియోగించడం వల్ల చర్మం బిగుతుగా చేసేందుకు సహాయపడుతుంది. దీనితో పాటు టానింగ్, డార్క్ స్పాట్స్, సన్ బర్న్ సమస్య నుంచి కూడా విముక్తి విముక్తి లభిస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. ఈ రైస్ వాటాను ముఖానికి ఎలా అప్లై చేసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
రైస్ ఐస్ క్యూబ్స్:
బియ్యాన్ని కడిగి ఆ నీటిని ఫ్రిడ్జ్ లోని ఐస్ ట్రేలో ఫిల్ చేసి ఐస్ గడ్డల్లా మారేదాకా ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత వాటిని తీసి ముఖానికి మర్దన చేసుకుంటే చాలా రకాల చర్మ సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా ఉబ్బిన కళ్ల సమస్యలతో బాధపడే వారికి ఇది గొప్ప ఉపశమనం ఇస్తుంది. అంతేకాకుండా ముఖంపై చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేసేందుకు కూడా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు.
రైస్ వాటర్ ఫేస్ మాస్క్:
చర్మాన్ని సంరక్షించుకునేందుకు రైస్ వాటర్ తో చేసిన ఫేస్ మాస్ కూడా వినియోగించవచ్చు. దీనిని తయారు చేయడానికి ముందుగా సేనగా పిండిని ఒక గిన్నెలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న శెనగపిండిలో బియ్యాన్ని కడగగా వచ్చిన రైస్ వాటర్ ని ఆ పిండిలో వేసి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై మచ్చలు తొలగిపోతాయి.
రైస్ వాటర్ టోనర్:
ఒక కాటన్ బాల్లో రైస్ వాటర్ తీసుకొని మీ ముఖానికి అప్లై చేయండి. ఇలా రైస్ వాటర్ ముఖానిపై ఆరిన తర్వాత ఆయుర్వేద గుణాలు కలిగిన ఫేస్ వాష్ వినియోగించి శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు కాటన్ టవల్ తో తుడుచుకోవాలి. ఇలా ప్రతిరోజు రైస్ వాటర్ టోనర్ ను వినియోగించడం వల్ల వృద్ధాప్య సంకేతాలు గల చర్మానికి గుడ్ బై చెప్పచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి