/telugu/photo-gallery/2024-karthika-pournami-wishes-for-your-family-and-friends-with-hd-photos-beautiful-messages-sd-180865 2024 Karthika Pournami Wishes: మీ  కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 2024 Karthika Pournami Wishes: మీ కుటుంబ సభ్యులకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలపండి..! 180865

IPL 2023 Title Winner: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ సరస నిలిచింది చెన్నై సూపర్‌కింగ్స్. ఐపీఎల్ తుదిపోరుతో 250 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఏకైక క్రికెటర్‌గా రికార్డు సాధించిన మహేంద్ర సింగ్ ధోనీ..టైటిల్ సాధించి మరో రికార్డు నెలకొల్పాడు. జట్టుకు ఐదవసారి టైటిల్ అందించాడు.

ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్‌కింగ్స్ రికార్డు సాధించింది. అత్యధిక సార్లు టైటిల్ గెల్చుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ సరసన నిలిచింది. మే 28న గుజరాత్ టైటాన్స్‌తో జరగాల్సిన ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దాంతో రెండవరోజు మే 29న ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

ఐపీఎల్ 2023 టైటిల్ సాధించి ఐదవ ఐపీఎల్ టైటిల్ సాధించాలన్న చెన్నై సూపర్‌కింగ్స్ ఆశలు నీరుగారినట్టే అన్పించింది. మ్యాచ్ ప్రారంభమైన మూడు బంతులకే వర్షం అడ్డంకిగా మారింది. తిరిగి 12 గంటలకు మ్యాచ్ ప్రారంభమైనా 15 ఓవర్లకు కుదించారు. టార్గెట్ మాత్రం 171 పరుగులుగా నిర్ణయించారు. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడా్ , డేవన్ కాన్వేలు శుభారంభం ఇవ్వడం, ఆ తరువాత అజింక్యా రహానే, అంబటి రాయుడు చెలరేగి అడటంతో మ్యాచ్ సీఎస్కే, జీటీ జట్ల మధ్య హోరాహోరీగా మారింది. చివరి రెండు బంతులకు పది పరుగులు అవసరం కాగా బరిలో ఉన్న రవీంద్ర జడేజా ఓ సిక్సర్, ఓ బౌండరీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అంతే చైన్నై ఐదవసారి టైటిల్ గెల్చుకోగా. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఇప్పటి వరకూ ఐపీఎల్ టైటిల్ ఐదుసార్లు సాధించిన ఘనత ముంబై ఇండియన్స్ జట్టుకు ఉంది. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 లలో టైటిల్స్ సాధించింది. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ 4 సార్లు టైటిల్ గెలిచి రెండవ స్థానంలో ఉండింది. సీఎస్కే ఇప్పటి వరకూ 2010, 2011, 2018, 2021లో టైటిల్ గెల్చుకోగా ఇప్పుడు 2023 టైటిల్‌తో ఐదుసార్లు గెలిచిన ఘనతతో ముంబై ఇండియన్స్ రికార్డు సమం చేసింది. జట్టుకు ఐదవ ఐపీఎల్ టైటిల్ అందించాలన్న ధోనీ కోరిక నెరవేరింది. 

Also read: IPL 2023: ఐపీఎల్ సీజన్ 16 విజేత చెన్నై, హోరాహోరీ పోరులో గుజరాత్‌కు తప్పని ఓటమి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
IPL 2023 Title Winner is Chennai superkings beats gujarat in neck to neck match and grabs ipl title 5th time sets mumbai indians record equal
News Source: 
Home Title: 

IPL 2023 Title Winner: ఉత్కంఠపోరులో విజయంతో 5వసారి టైటిల్ కైవసం చేసుకున్నచెన్నై

IPL 2023 Title Winner: ఉత్కంఠపోరులో  విజయంతో 5వసారి టైటిల్ కైవసం చేసుకున్నచెన్నై, ఎప్పుడెప్పుడంటే
Caption: 
IPL 2023 Tile Winner CSK ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
IPL 2023 Title Winner: ఉత్కంఠపోరులో విజయంతో 5వసారి టైటిల్ కైవసం చేసుకున్నచెన్నై
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, May 30, 2023 - 02:25
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
31
Is Breaking News: 
No
Word Count: 
286