CSK Coach Stephen Fleming feels Gujarat Titans difficult to win IPL 2023 Title : ఐపీఎల్ 2023 ఫైనల్ మరికొద్ది గంటల్లో ఆరంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవనుంది. ఈ మెగా సమరం కోసం క్రికెట్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్, అందులోనూ సండే కావడంతో వ్యూయర్ షిప్ భారీ స్థాయిలో ఉండనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. టైటిల్ ఎవరిని వరిస్తుందో చూడాలి.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఎంఎస్ ధోనీ ప్రధాన ఆకర్షణ కాగా.. గుజరాత్ టైటాన్స్ టీంలో సెంచరీల హీరో శుభ్‌మన్ గిల్ ప్రత్యేక ఆక్షర్షణగా నిలవనున్నాడు. మహీ కెప్టెన్సీ, అతడికి ఇదే చివరి సీజన్ అని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాడు. మరోవైపు వరుస సెంచరీలు చేస్తున్న గిల్ ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్నాడు. అతడిని అడ్డుకోవడంపైనే చెన్నై విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలో చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గతంలో కంటే ఇప్పుడు తమ సన్నద్ధత మరింత ఉత్తమంగా ఉందన్నాడు. సాధారణంగా తమ గెలుపు, ఓటముల నిష్పత్తి 50 శాతంగా ఉందని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు.
ఫైనల్ మ్యాచుకు ముందు చెన్నై హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ... 'ఫైనల్ మ్యాచ్‌లు ఎప్పుడూ కూడా సవాళ్లతో కూడకున్నవే. మా టీం బయటి మైదానాల్లో కొన్నిసార్లు పరిస్థితులతో పోరాడాల్సి వచ్చింది. అయితే ఈసారి చెన్నై ప్లేయర్స్ బాగా సన్నద్ధమయ్యారు. తుది పోరులో విజయం సాధించడంలో మా రికార్డు 50 శాతంగా ఉంది. మేం సొంత మైదానాల్లో అద్భుతంగా ఆడాం. తటస్థ వేదికల్లో త్వరగా కుదురుకోవాల్సిన అవసరం ఉంది. తొలి క్వాలిఫయర్‌లో ముందుగా మేం బౌలింగ్ చేయాలని భావించాం. కానీ తొలుత బ్యాటింగ్ చేయడం సరైందేనని తేలింది. ఎంఎస్ ధోనీ కూడా తన కెప్టెన్సీతో చెన్నైని గెలిపించాడు. ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడితే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలి. అహ్మదాబాద్ పిచ్ పరిస్థితుల గురించి మాకేం ఆందోళన లేదు. గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతంగా ఉన్నాం' అని అన్నాడు.
'శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అతడిని అడ్డుకోవడానికి మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు ఉండవు. గిల్‌ను త్వరగా ఔట్ చేయాలి. గుజరాత్‌తో మ్యాచ్‌లో త్వరగా వికెట్లను తీయడం వల్లనే విజయం దక్కింది. ఈ రోజు కూడా అలానే చేస్తాం. వరుసగా టైటిళ్లను సాధించడం చాలా కష్టం. గుజరాత్‌కు టైటిల్ గెలవడం కష్టమవుతుందని భావిస్తున్నా. అయితే అన్ని విభాగాల్లోనూ హార్దిక్ సేన బలంగా ఉంది. గుజరాత్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఆశిశ్ నెహ్రా ఆధ్వర్యంలోని కోచింగ్ టీమ్ అద్భుతంగా పని చేస్తోంది. చెన్నై తరఫున ఆడినప్పుడు కూడా ఇదే ఉత్సాహంతో ఉండేవాడు. మాకున్న అనుభవంతో తప్పకుండా ఫైనల్లో గెలిచి.. కప్‌ను సొంతం చేసుకుటాం' అని చెన్నై కోచ్ ఫ్లెమింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Shubman Gill: చెన్నై ఐదో టైటిల్ కలకు అతడు అడ్డంకిగా మారతాడు.. భారత మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.