Venus Transit into Cancer: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్ర గ్రహానికి మంచి ప్రాముఖ్యత ఉంది. గ్రహాన్ని ఐశ్వర్యం సంపదకు కారకంగా పరిగణిస్తారు. సంచారం జరగడం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల్లో భారీ మార్పులు సంభవిస్తారు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు దుష్ప్రభావాల గురవుతే మరికొన్ని రాశుల వారు మంచి ప్రయోజనాలు పొందుతారు. శుక్ర గ్రహం మే 30వ తేదీన మిధున రాశిని వదిలి కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. సంచారం జేష్ట మాసంలోని శుక్లపక్షం దశమి తిథిన జరగబోతోంది. ఈ శుక్రుడి సంచారంతో పలు రాశుల వారి జీవితంలో మంచి ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు. ఏ రాశి వారి జీవితాల్లో ఎలాంటి ఫలితాలు పొందుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశుల వారి జీవితాల్లో శుక్రుడి ప్రభావం:
మేషరాశి:
కర్కాటక రాశిలోకి శుక్ర గ్రహం సంచారం చేయబోతోంది కాబట్టి మేష రాశి వారి జీవితం ఆహ్లాదకరంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సంచార క్రమంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయం సాధించడమే కాకుండా మంచి శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ లభించడమే కాకుండా జీతం పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ శుక్ర గ్రహ సంచారం కారణంగా తప్పకుండా పొందుతారు.
కర్కాటక రాశి:
శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకే సంచారం చేయబోతోంది కాబట్టి.. ఈ రాశి వారు చాలా ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నారు. ఈ రాశి వారు భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆఫీసులో శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితం గడుపుతున్న వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది.
Also Read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
వృశ్చిక రాశి:
శుక్ర గ్రహ సంచారం కారణంగా మే 30వ తేదీ నుంచి ఈ రాశి వారు అన్ని శుభవార్తలు వింటారు. వీరు ఎలాంటి కోరికలు కోరుకున్న సులభంగా నెరవేరుతాయి. ఏ కాకుండా విద్యారంగంతో అనుబంధం ఉన్నవారు శుక్ర గ్రహ సంచారం కారణంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. విదేశాల్లో చదవాలనుకున్న వారి కోరికలు నెరవేరుతాయి.
మీన రాశి:
మీన రాశి వారికి ఐదవ స్థానంలో శుక్రుడు సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కారణంగా ఈ రాశి వారు ఆర్థిక లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా వీరు భవిష్యత్తులో భారీగా ప్రయోజనాలు పొందుతారు. శుక్రుడు సంచారం కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి.
Also Read: OLD Parliament History: కొత్త పార్లమెంట్ సరే..పాత పార్లమెంట్ చరిత్ర, ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook