Muskmelon Seeds Benefits: కర్బూజ గింజలతో శరీర బరువు తగ్గడమేకాకుండా కొలెస్ట్రాల్ వెన్నలా కరడం ఖాయం!

Muskmelon Seeds Benefits: కర్బూజ గింజలతో తయారు చేసిన డ్రింక్స్‌ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 26, 2023, 04:44 PM IST
Muskmelon Seeds Benefits: కర్బూజ గింజలతో శరీర బరువు తగ్గడమేకాకుండా కొలెస్ట్రాల్ వెన్నలా కరడం ఖాయం!

Muskmelon Seeds Benefits: వేసవిలో కర్బూజ పండ్లు తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగుతాయి. ఇందులో విటమిన్స్‌ అధిక పరిమాణంలో లభిస్తాయి.  ఈ పండ్లే కాకుండా శరీరానికి గింజలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ గింజల్లో ఉండే పోషకాలు తీవ్ర వ్యాధులను సైతం దూరం చేస్తాయి. కర్బూజ పండ్లతో తయారు చేసిన షేక్‌ను ప్రతి రోజు తాగడం వల్ల కంటి చూపు సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఈ గింజలను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

పుచ్చకాయ విత్తనాల ప్రయోజనాలు:

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  

  • ✴ కర్బూజ గింజల్లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కంటి చూపు సమస్యలతో బాధపడేవారు కర్బూజ గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు కూడా సులభంగా దూరమవుతాయి. 
  • ✴ కర్బూజ గింజల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి శరీరాన్ని అభివృద్ధి చేసేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా జుట్టు సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది. 
  • ✴ ఈ గింజల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.  తెల్ల రక్త కణాలను సంఖ్యను పెంచేందుకు కూడా దోహదపడుతుంది. అంతేకాకుండా ప్రోటీన్‌ లోపం సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ పండుతో తయారు చేసిన గింజలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 
  • ✴ మలబద్ధకంతో బాధపడేవారికి కర్బూజ గింజలు ఔషధంగా పని చేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్‌ పరిమాణాలు కూడా అధికంగా లభిస్తాయి. శరీర బరువును తగ్గించేందుకు కూడా ఈ గింజలు సహాయపడతాయి. 
  • ✴ కర్బూజ గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి.  ఇందులో ఉండే గుణాలు గుండె ఆరోగంగా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి గుండె సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వీటిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. 
  • ✴ కర్బూజ గింజలలో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల రక్తపోటు సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. 

Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెండింగ్ డీఏ విడుదలకు గ్రీన్ సిగ్నల్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News