Thandra Paparayudu: ఆరుగురు ఎంపీలు కలిసి పని చేసిన సినిమా ఏంటో తెలుసా?

6 Parliament Members For Thandra Paparayudu: దాదాపు ఆరుగురు ఎంపీలు పనిచేసిన ఒక సినిమా ఉంది, 1986వ సంవత్సరంలో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా ఈ సినిమా రూపొందింది.

Written by - Chaganti Bhargav | Last Updated : May 24, 2023, 04:40 PM IST
Thandra Paparayudu: ఆరుగురు ఎంపీలు కలిసి పని చేసిన సినిమా ఏంటో తెలుసా?

6 Parliament Members Worked For Thandra Paparayudu: సినీ రంగానికి రాజకీయ రంగానికి విడదీయలేని సంబంధం ఉంది. సినీ నటీనటులుగా తమను తాము ప్రూవ్ చేసుకున్న వారు రాజకీయాల్లో కూడా తమ అదృష్టం పరీక్షించుకునే వారే ఎక్కువగా ఉన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ పరిశ్రమలకు చెందిన వారు చాలా మంది ముందుగా సినీ నటులుగా ప్రూవ్ చేసుకున్న తర్వాత రాజకీయాల్లో కూడా తమ సత్తా చాటారు.

అలా దాదాపు ఆరుగురు ఎంపీలు పనిచేసిన ఒక సినిమా ఉంది అంటే అతిశయోక్తి కాదు. అసలు విషయం ఏమిటంటే వారంతా ఎంపీలుగా పనిచేశారు. కానీ ఒకే సమయంలో పని చేయలేదు. వివిధ సమయాల్లో తమ జీవిత కాలంలో ఎంపీలుగా పనిచేసిన ఆరుగురు ఒకే సినిమా కోసం పనిచేశారు, అదే తాండ్రపాపారాయుడు. 1986వ సంవత్సరంలో దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా రూపొందింది.

Also Read: Dhanush’s D50: మరో బంపర్ ఆఫర్ కొట్టేసిన సందీప్ కిషన్.. మళ్లీ ధనుష్ సినిమాలో కీ రోల్!

గోపికృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమాని ప్రభాస్ తండ్రి యూ. సత్యనారాయణ రాజు నిర్మించారు. ఈ సినిమాలో కృష్ణంరాజు, జయప్రద, జయసుధ, సుమలత, ప్రాన్, మోహన్ బాబు ముఖ్య పాత్రలలో కనిపించారు. అయితే ఈ సినిమాకి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే ఈ సినిమా కోసం పనిచేసిన హీరో కృష్ణంరాజు, హీరోయిన్ జయప్రద, దర్శకుడు దాసరి నారాయణరావు, పాటల రచయిత సి నారాయణ రెడ్డి, నటుడు మోహన్ బాబు, నటి సుమలత ఈ ఆరుగురు పార్లమెంట్ సభ్యులుగా పని చేసిన వారే.

అంటే ఒకే సమయంలో పార్లమెంట్లో వీరు కలిసి పనిచేయలేదు కానీ లోకసభ సభ్యులుగా కొందరు రాజ్యసభ సభ్యులుగా కొందరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా పార్లమెంట్లో మెంబర్గా వ్యవహరించారు. అలా ఈ తాండ్రపాపారాయుడు సినిమా ఆరుగురు పార్లమెంట్ సభ్యులు కలిసి పనిచేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బొబ్బిలి రాజులకు విజయనగర రాజులకు మధ్య యుద్ధం ఏర్పడినప్పుడు రాజాం రాజుగా ఉన్న తాండ్రపాపారాయుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు? ఆ నిర్ణయాల వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి వంటి అంశాలతో ఈ సినిమాని దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించారు. 

Also Read: Hansika Comments: ఆ హీరో వెంటపడ్డాడు.. సరైన బుద్ధి చెప్పా.. హన్సిక సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News