Jyeshtha Shukla Paksha 2023: జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షానికి హిందూ సంప్రదాయంలో ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ప్రతి సంవత్సం 20 మేన జ్యేష్ఠ మాసం శుక్ల పక్షం ప్రారంభమవుతుంది. ఇదే క్రమంలో వట సావిత్రి వ్రతం కూడా ముగుస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో దేవతలను ఉపవాసాలు పాటించి పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ క్రమంలో దానం చేయడం వల్ల కూడా కుటుంబంలో సంతోషాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలో ఏయే దేవతలకు ఉపవాసాలు పాటించడం మంచి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో ఈ పూజలు చేయండి:
✹ మంగళవారం 23 మే 2023: వినాయక చతుర్థి
✹ గురువారం 25 మే 2023: స్కంద షష్ఠి వ్రతం
✹ సోమవారం 29 మే 2023: మహేష నవమి
✹ మంగళవారం 30 మే 2023: గంగా దసరా
✹ బుధవారం 31 మే 2023: నిర్జల ఏకాదశి, గాయత్రి జయంతి
✹ గురువారం 1 జూన్ 2023: ప్రదోష వ్రతం
✹ ఆదివారం 4 జూన్ 2023: జ్యేష్ఠ పూర్ణిమ
ఇలా పూజా కార్యక్రమాలు చేయండి:
జ్యేష్ఠ మాసంలోని వినాయక చతుర్థి రోజున గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల మేధో వికాసం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా రాహు-కేతువుల దుష్ప్రభావాలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి తీవ్ర ఆర్థిక సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది.
మహేశ నవమి రోజు భార్యాభర్తలు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కూడా సులభంగా దూరమవుతాయి. ముఖ్యంగా ఈ రోజు శివునికి రుద్రాభిషేకం చేయండం వల్ల జీవితంలో కలిగే అన్ని రకాల సమస్యలు దూరమవుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
గంగా దసరా జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన పరిహారాలు పాటించడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా కుటుంబ సమస్యలు కూడా దూరమవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి కుటుంబంలో సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ పరిహారాలు పాటించాల్సి ఉంటుంది.
ఇదే క్రమంలో వట సావిత్రి వ్రతం చేయడం వల్ల కూడా సులభంగా సంతాన కోరికలు నెరవేరుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వ్రతంగా భాగంగా స్త్రీలు మర్రి చెట్టుకు పూజా కార్యక్రమాలు చేయడం వల్ల మంచి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook