Haseena Movie Review : హసీనా మూవీ రివ్యూ.. క్షణక్షణం ట్విస్టులే

Haseena Movie Review క్షణక్షణం ట్విస్టులు ఇస్తూ సినిమాను మలుపులు తిప్పడం అంత సులభమైన పనేమీ కాదు. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్‌లు జనాలను సీటు అంచున కూర్చోబెడతాయి. అలాంటి జానర్‌లో వచ్చిన హసీనా మూవీ ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 04:45 PM IST
  • థియేటర్లోకి వచ్చిన హసీనా
  • క్షణక్షణం ట్విస్టులే ట్విస్టులు
  • హసీనా ఎలా ఉందంటే?
Haseena Movie Review : హసీనా మూవీ రివ్యూ.. క్షణక్షణం ట్విస్టులే

Haseena Movie Review కొత్త నటీనటులు ఓ సినిమాను చేయడం, జనాల్లోకి వెళ్లడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఇప్పుడు ప్రియాంక డెయ్, థన్వీర్, సాయి తేజ గంజి, శివ గంగా, ఆకాష్ లాల్ ఇలా అంతా కలిసి హసీనా సినిమాతో ముందుకు వచ్చారు. ఈ సినిమాకు తన్వీర్ ఎండీ నిర్మాతగా, ఎస్ రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం ఇప్పుడు వీరి భవిష్యత్తుని ఎలా నిర్ణయించిందో ఓ సారి చూద్దాం.

కథ
హసీనా (ప్రియాంక డెయ్), థన్వీర్ (థన్వీర్ ఎండీ), సాయి (సాయి తేజ గంజి), శివ (శివ గంగా), ఆకాష్ (ఆకాష్ లాల్)లు అనాథలు. అందరూ కలిసి కష్టపడి చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు సంపాదిస్తారు. చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసి పెరుగుతుంటారు. అయితే హసీనా పుట్టిన రోజున ఓ చేదు అనుభవం ఏర్పడుతుంది. ఆ చేదు ఘటనతో ఆ నలుగురి జీవితాలు మలుపులు తిరుగుతాయి. వీరి కథలోకి అభి (అభినవ్‌) ఎంట్రీ ఎలా ఇచ్చాడు? చివరకు అభి ఏం చేశాడు? ఆ నలుగురు స్నేహితులు, హసీనాల ప్లాన్ ఏంటి? చివరకు అందరూ ఏమయ్యారు? కథ ఎలా ముగిసింది? అన్నది తెరపై చూడాల్సిందే.

నటీనటులు
కొత్త నటీనటులే అయినా కూడా తెరపై ఎంతో చక్కగా నటించారు. కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ ఇలా అన్ని సీన్లలో అందరూ పర్వాలేదనిపించారు. థన్వీర్, సాయి, శివ, ఆకాష్‌ ఇలా అందరూ తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఇక హసీనా చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. హసీనా పాత్రలో ప్రియాంక చాలానే వేరియేషన్స్ చూపించింది. అభి పాత్రలో విలనిజాన్ని, హీరోయిజాన్ని అభినవ్ చూపించాడు. సీఐ పాత్ర కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇలా మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు మెప్పిస్తాయి.

విశ్లేషణ
నలుగురు అబ్బాయిలు, ఓ అమ్మాయి ఇలా ఓ ఐదుగురు అనాథలు చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం, కలిసి చదవడం, ఉద్యోగాలు చేస్తుండటం.. వంటి సీన్లతో ప్రథమార్థాన్ని అలా మెల్లిగా లాక్కొచ్చాడు దర్శకుడు. మధ్య మధ్యలో అభి పాత్రతో విలనిజాన్ని చూపిస్తూ వచ్చాడు డైరెక్టర్. ప్రథమార్థం చివరకు ఓ ట్విస్ట్‌ను పెట్టాను. ఆ ఐదుగురు అనాథలు ఓ కేసులో చిక్కుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠతో ద్వితీయార్థాన్ని నడిపించాడు.

Also Read:  Rajinikanth Last Movie : రజినీ లాస్ట్ సినిమా అదేనా?.. లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సూపర్ స్టార్

ఇక ద్వితీయార్థాన్ని నడిపించిన తీరు బాగానే అనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల ట్విస్టులు ఊహకందేలా ఉంటాయి. మరి కొన్ని చోట్ల ఇదేం ట్విస్ట్‌ రా అని ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మరి కొన్ని చోట్ల.. ఇన్ని ట్విస్టులా? అని ఆశ్చర్యపోతోంది. సినిమా ఎండింగ్ వరకు ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. అలా క్షణక్షణానికి ప్రేక్షకులు ట్విస్ట్ ఫీల్ అవుతారు. కానీ అందులో అంత ఇంపాక్ట్ కనిపించదు. ఆ పాత్రలను ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్‌ విఫలమైనట్టుగా అనిపిస్తుంది.

సాంకేతికంగా సినిమా పర్వాలేదనిపిస్తుంది. ఆర్ఆర్ బాగుంది. ఉన్న రెండో మూడో పాటలు సందర్భానుసారంగా వస్తాయి. మాటలు కొన్ని చోట్ల మెప్పిస్తాయి. నవ్విస్తాయి. ఆలోచింపచేస్తాయి. ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ 2.5

Also Read:  Mrunal Thakur Photos: తెగించేసిన సీత.. అందాలన్నీ కనిపించేలా హాట్ ట్రీట్.. చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News