IPL 2023: ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ మరియు నవీన్ ఉల్ హక్ మధ్య జరిగిన గొడవ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరి మధ్య గొడవ మ్యాచ్ పూర్తి అయిన తర్వాత కూడా కొనసాగింది. వీరిద్దరి మధ్య గొడవలోకి గౌతమ్ గంభీర్ రావడం.. గొడవ మరింతగా పెరగడం జరిగింది. సోషల్ మీడియాలో ఈ గొడవకు సంబంధించిన హడావుడి మామూలుగా లేదు.
కోహ్లీ అభిమానులు నవీన్ ఉల్ హక్ తో పాటు గంభీర్ ను తీవ్రంగా ట్రోల్స్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో బూతులు తిడుతూ వారిద్దరి పై కోహ్లీ అభిమానులు విరుచుకు పడ్డారు. మరి కొందరు కోహ్లీ తీరును విమర్శించారు. మొత్తానికి అటు వైపు ఇటు వైపు అభిమానులు ఓ రేంజ్ లో రెండు రోజుల పాటు ఒకరిని ఒకరు ట్రోల్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఆ వివాదం చల్లారుతుంది అనుకుంటూ ఉన్న సమయంలో నవీన్ ఉల్ హక్ చేసిన పోస్ట్ కవ్వింపు చర్య అన్నట్లుగా ఉంది.
తాజాగా బెంగళూరు మరియు ముంబయి జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ కేవలం ఒకే ఒక్క పరుగు చేసి ఔట్ అయిన విషయం తెల్సిందే. ఆ ఔట్ ను నవీన్ ఉల్ హక్ సెలబ్రేట్ చేసుకున్నట్లుగా పోస్ట్ ను పెట్టాడు. ఇండైరెక్ట్ గా ఈ పోస్ట్ ను పెట్టాడు. మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఔట్ అయిన వెంటనే స్వీట్ మామిడి కాయలు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
ఆ సమయంలో కోహ్లీ ఔట్ అయిన విజువల్స్ ను కూడా జోడించాడు. టీవీ ముందు మామిడి కాయలు పెట్టి స్వీట్ మ్యాంగోస్ అంటూ పోస్ట్ పెట్టడం చూస్తూ అది కచ్చితంగా కోహ్లీని కవ్వించడమే అని.. ఆయన యొక్క అభిమానులను కవ్వించడమే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా కూడా నవీన్ ఉల్ హక్ పట్టించుకోకుండా ఆ పోస్ట్ ని కంటిన్యూ చేశాడు.
వివాదం సర్ధమనిగింది అనుకుంటే మళ్లీ ఇలాంటి ఒక పోస్ట్ ను నవీన్ ఉల్ హక్ పోస్ట్ చేయడం తో వివాదాస్పదం అవుతుంది. ముందు ముందు మళ్లీ ఇలాంటి మరిన్ని కవ్వింపు చర్యలు ఉంటాయి అన్నట్లుగా నవీన్ ఉల్ హక్ ఈ పోస్ట్ ను షేర్ చేయడంను అభిమానులు తప్పుబడుతున్నారు. మ్యాచ్ లో కొన్ని సందర్భాల్లో ఎమోషన్స్ పీక్స్ కు వెళ్లి గొడవలు జరుగుతూ ఉంటాయి.
కానీ వాటిని ఎప్పటికి అప్పుడు వదిలి వేయాలి అంటూ నవీన్ ఉల్ హక్ కు కొందరు హితవు పలుకుతున్నారు. ఇలాంటి బుద్ది లేని పోస్ట్ పెట్టడం ద్వారా ఆట యొక్క మంచి వాతావరణం పోగొట్టిన వారు అవుతారు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ లో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా పునరావృతం కాలేదు. వీరికి బ్యాచ్ ఫీజ్ లో కొత విధించి ఫైన్ వేయడం జరిగింది. అంతే కాకుండా వారిని పిలిచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందని క్రికెట్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: TS SSC Results 2023: పది ఫలితాలు వచ్చేశాయి..రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Kohli Vs Naveen: కోహ్లీని మామిడి పండ్లతో కవ్వించిన నవీన్ ఉల్ హక్.. బుద్ది లేని పని