GT vs LSG Dream11 Prediction Today: అన్నదమ్ముల మధ్య పోరు.. గుజరాత్‌కు లక్నో కళ్లెం వేసేనా.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!

Gujarat Titans Vs Lucknow Super Giants Dream 11 Tips: గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ నేడు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్ రేసు బెర్త్ కన్ఫార్‌ చేసుకోవాలని గుజరాత్ భావిస్తుండగా.. గుజరాత్‌ను ఓడించి పాయింట్స్ టేబుల్‌ రెండోస్థానానికి రావాలని లక్నో చూస్తోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 7, 2023, 12:34 PM IST
GT vs LSG Dream11 Prediction Today: అన్నదమ్ముల మధ్య పోరు.. గుజరాత్‌కు లక్నో కళ్లెం వేసేనా.. డ్రీమ్ 11 టీమ్ ఇదే..!

Gujarat Titans Vs Lucknow Super Giants Dream 11 Tips: ఐపీఎల్‌లో నేడు అన్నదమ్ముల మధ్య పోరు జరగనుంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా ఉండనుంది. లక్నో రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ దూరమైన నేపథ్యంలో కృనాల్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అటు గుజరాత్ జట్టుకు కృనాల్ సోదరుడు హర్ధిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో తొలిసారి ఇద్దరు అన్నదమ్ములు కెప్టెన్లుగా బరిలోకి దిగుతుండడం విశేషం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో గుజరాత్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. లక్నో మూడోస్థానంలో ఉంది. గుజరాత్ ఇప్పటివరకు 7 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. లక్నో ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. గుజరాత్ ప్లే ఆఫ్‌కు చేరడం దాదాపు ఖాయమే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 3.30 గంటలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. 

ఈ సీజన్‌లో రెండు జట్లు ముఖాముఖి తలపడగా.. గుజరాత్ 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ లేని లక్నో బ్యాటింగ్ ఆర్డర్ కాస్త బలహీనంగా మారింది. కైల్ మేయర్స్, స్టొయినిస్, నికోలస్ పూరన్, ఆయూష్ బదోనిలపై ఆశలు పెట్టుకుంది. మనన్ వోహ్రా, కరణ్‌ నాయర్‌లను గత మ్యాచ్‌లో అవకాశం కల్పించినా విఫలం అయ్యారు. కెప్టెన్ కృనాల్ పాండ్యా బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించాలి. బౌలింగ్‌లో మార్క్‌ వుడ్ దూరమవ్వడం ఆ జట్టుకు మరో ఎదురుదెబ్బ. నవీన్‌ ఉల్‌ హక్‌, రవి బిష్ణోయ్‌ ఆకట్టుకుంటున్నారు. బలమైన గుజరాత్‌ను ఓడించాలంటే అంచనాలకు మించి రాణించాలి.

గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. ఆ జట్టు అతిపెద్ద బలం బౌలింగ్. మహ్మద్ షమీ పవర్‌ప్లేలో వికెట్లు తీస్తూ.. మంచి ఆరంభాలు ఇస్తుండగా.. మోహిత్ శర్మ, అల్జారీ జోసెఫ్ చక్కటి సహకారం అందిస్తున్నారు. స్పిన్ ద్వయం రషీద్, నూర్ బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. గుజరాత్ ఓపెనింగ్ సమస్య కూడా తీరింది. గత మ్యాచ్‌తో వృద్ధిమాన్ సాహా కూడా ఫామ్ అందుకున్నాడు. గిల్, పాండ్యా, మిల్లర్, తెవాటియా, అభినవ్ మనోహార్ వంటి స్టార్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తే.. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించడం సులువే.

తుది జట్లు ఇలా.. (అంచనా)

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్ , రాహుల్ తెవాటియా,  రషీద్ ఖాన్, షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, అల్జరీ జోసఫ్

లక్నో సూపర్ జెయింట్స్: కైల్ మేయర్స్, వోహ్రా, కృనాల్ పాండ్యా (కెప్టెన్), కరణ్ నాయర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), స్టోయినిస్, కృష్ణప్ప గౌతం, ఆయూష్‌ బదోని, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మోహ్సిన్ ఖాన్

డ్రీమ్ 11 టీమ్ టిప్స్..

వికెట్ కీపర్లు: వృద్ధిమాన్ సాహా, నికోలస్ పూరన్
బ్యాట్స్‌మెన్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆయూష్‌ బదోని
ఆల్‌రౌండర్లు: కైల్ మేయర్స్ (వైస్ కెప్టెన్), హార్ధిక్ పాండ్యా, స్టోయినిస్ 
బౌలర్లు: రషీద్ ఖాన్, షమీ, నవీన్-ఉల్-హక్

Also Read: Virat Kohli Records: విరాట్ కోహ్లీ మరో రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా..

Also Read: Virat Kohli Sourav Ganguly Controversy: చేతులు కలిపిన గంగూలీ, విరాట్.. వివాదానికి ముగింపు..!   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News