Mangal Gochar 2023: మరో 3 రోజుల్లో నీచభంగ రాజయోగం...ఈ 3 రాశులు ధనవంతులు అవ్వడం ఖాయం..

Benefits of Neechabhang Raja Yoga: అంగారకుడు నీచభంగ రాజయోగాన్ని చేస్తున్నాడు. దీని కారణంగా మూడు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 7, 2023, 12:03 PM IST
Mangal Gochar 2023: మరో 3 రోజుల్లో నీచభంగ రాజయోగం...ఈ 3 రాశులు ధనవంతులు అవ్వడం ఖాయం..

Mangal Gochar 2023: ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. జాతకంలోని గ్రహాల స్థానాన్నే బట్టే జ్యోతిష్కులు మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెబుతారు. అంగారకుడిని శక్తికి కారకుడిగా భావిస్తారు. మే 10న కుజుడు కర్కాటక రాశిలో సంచరించబోతున్నాడు. జూలై 1 వరకు అతడు అదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో మార్స్ నీచభంగ్ రాజయోగాన్ని చేస్తున్నాడు. ఇది మూడు రాశులవారికి కలిసి వస్తుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

మిథునరాశి
నీచభంగ్ రాజయోగం మిథునరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. మీ జాతకంలోని రెండవ ఇంట్లో కుజుడు సంచరించబోతున్నాడు. దీంతో మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మీ మాటలతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఆఫీసులో మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. అంతేకాకుండా మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. 
తుల రాశి
తుల రాశి వారికి నీచభంగ్ రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. దీంతో మీరు వ్యాపారంలో మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్‌తోపాటు ప్రమోషన్‌ కూడా లభిస్తుంది. ఆఫీసులో మీ ప్రాబల్యం పెరుగుతుంది. మీ ఫ్యామిలీ సపోర్టు కూడా లభిస్తుంది. 
కర్కాటక రాశి
నీచభంగ రాజయోగం కర్కాటక రాశి వారిని ధనవంతులు చేస్తుంది. మీ రాశిచక్రం యొక్క లగ్న గృహంలో కుజుడు సంచరించబోతున్నాడు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు కష్టాల నుండి బయటపడతారు. పార్టనర్ షిప్ తో పనిచేసేవారు మంచి లాభాలను పొందుతారు. మీరు పెట్టుబడలు ద్వారా ప్రయోజనం పొందుతారు.

Also Read: Guru Uday 2023: హన్స్ రాజయోగంతో ఈ 3 రాశులపై నోట్ల వర్షం.. ఇందులో మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News