Superfoods For Kids: పిల్లల శారీరకంగా, మానసికంగా బాగుండాలంటే తప్పకుండా వారికి పౌష్టిక ఆహారాలు అందివాల్సి ఉంటుంది. ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీనికి ప్రధాన కారణాలు తీసుకునే ఆహారాలు పౌష్టికంగా లేకపోవడం. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు పోషకాలు అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు ఇవ్వాల్సి ఉంటుంది. సూపర్ ఫుడ్స్‌ను ప్రతి రోజు ఇవ్వడం వల్ల సులభంగా శరీరం అభివృద్ధి చెందుతుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ప్రతి రోజు పిల్లలకు ఎలాంటి సూపర్ ఫుడ్స్ ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సూపర్ ఫుడ్స్ తప్పకుండా పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుంది:
1. పాలు:
పాలలో కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కాల్షియంతో పాటు విటమిన్ డి, ఫాస్పరస్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు రెండు గ్లాసుల చొప్పున పిల్లకు అందిస్తే చాలా అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
2. ఎగ్స్:
ఎగ్స్ అన్ని వయసుల వారికి సూపర్ ఫుడ్ లాంటిది. కాబట్టి చిన్న పిల్లలకు ప్రతి రోజు ఒక గుడ్డును ఆహారంగా ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో ప్రొటీన్లు, విటమిన్-బి, విటమిన్-డి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజు తినడం వల్ల పిల్లల శరీర అభివృద్ధికి సహాయపడుతుంది.
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
3. డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ కూడా పిల్లల ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు పిల్లలకు జీడిపప్పు, బాదం, వాల్‌నట్స్‌ను ఆహారంగా ఇవ్వడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరానికి శక్తిని అందించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
4. గ్రీన్ వెజిటేబుల్స్:
గ్రీన్ వెజిటేబుల్స్‌లు కూడా శరీరానికి చాలా మంచివి.. ఇందులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసిన ఆహారాలు పిల్లలకు ఇవ్వడం వల్ల పిల్లల శరీరం దృఢంగా మారుతుంది. కాబట్టి ప్రతి రోజు బచ్చలికూర, బ్రకోలీ, క్యాబేజీ ఆహారంలో ఇవ్వాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also read: Shani Jayanti 2023: శని జయంతి రోజు ఈ ఉపాయాలు పాటిస్తే శని దోషం, దుష్ప్రభావాల్నించి ఉపశమనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook