White Hair Problem: జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆయుర్వేద నిపుణులు సూచించిన హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్‌ను వినియోగించడం వల్ల కూడా సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
White Hair Problem: జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు పాటించడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టు, హెయిర్ ఫాల్ సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే జుట్టు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు ఆయుర్వేద నిపుణులు సూచించిన ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్ వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ఐదు టీ స్పూన్ల వేప ఆకులు, ఆవాల నూనె, కాఫీ పొడిని ఒక బౌల్లో కలుపుకుని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 25 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి. తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది.
జుట్టును మృదువుగా, మెరిసేలా తయారు కావడానికి ప్రతి రోజు హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్‌ను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల సులభంగా మంచి ఫలితాలు కలుగుతాయి.
వేప ఆకుల హెయిర్ మాస్క్‌ని రెగ్యులర్‌గా వాడితే జుట్టు పెరుగుదల రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా జుట్టు చుండ్రు సమస్యలు కూడా సులభంగా దూరమవుతుందని నిపుణులు అంటున్నారు.
ఈ హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్‌ను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల జుట్టు మూలాల నుంచి దృఢంగా తయారవుతుంది. అంతేకాకుండా పొడవుగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
చుండ్రు, తలలో దురద వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా హెయిర్ ఫాల్ కంట్రోల్ మాస్క్‌ను వాడాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు జుట్టు రాలడాన్ని కూడా సులభంగా నియంత్రిస్తుంది.