Best Home Remedies for Constipation: అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా మందిలో మలబద్ధకం సమస్యలు వస్తున్నాయి. ఇలా సమస్యల కారణంగా చాలా మందిలో విసర్జన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో తీవ్ర పొట్ట సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజు పీచుపదార్థాలను ఎక్కువగా తినాల్సి ఉంటుంది. ఈ ఆహారాలు ప్రతి రోజు తినడం వల్ల పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు ఎలాంటి ఆహారాలు ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మలబద్ధకం సమస్యతో బాధపడేవారు తప్పకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా పలు ఇంటి నివారణలు కూడా పాటించాలి. మలబద్ధకంతో బాధపడేవారికి బొప్పాయి చాలా మేలు చేస్తుంది. ఈ పండును తినడం వల్ల తక్షణమే ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
బొప్పాయి ఆకు కూడా మలబద్ధకానికి ఉపయోగపడుతుందా?:
మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా బొప్పాయి ఆకులను ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకులతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజు తాగితే..జీర్ణ శక్తిని మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి ఆకులలో విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ, విటమిన్ కెతో పాటు ఇతర విటమిన్లు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ రసాన్ని ప్రతి రోజు తాగితే రక్త కణాల సంఖ్య కూడా పెరగుతుంది. రక్తపోటు ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ రసాన్ని తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని తాగడం వల్ల గుండెల్లో మంట, అసిడిటీ, పుల్లటి త్రేనుపు, ఛాతీలో మంట వంటి సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది.
ఇలా బొప్పాయి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది:
ముందుగా బొప్పాయి ఆకులను తీసుకుని చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్లెండర్లో వేసి రసంలా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రసంలో కొన్ని నీటిని వేసుకుని ప్రతి రోజు తాగితే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. కాబట్టి ప్రతి రోజు బొప్పాయి ఆకులను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Nani 30 Look : లుక్ రివీల్ కాకూదనే అలా పెట్టాడా?.. నాని పోస్ట్ వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook