Gajalaxmi Rajayogam Effect: గజలక్ష్మీ రాజయోగం ఆ 5 రాశుల జీవితాల్ని మార్చేస్తుంది, వద్దంటే డబ్బులు

Gajalaxmi Rajayogam Effect: జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో నిర్దేశిత రాశిలో ప్రవేశిస్తుంటుంది. గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 1, 2023, 05:50 AM IST
Gajalaxmi Rajayogam Effect: గజలక్ష్మీ రాజయోగం ఆ 5 రాశుల జీవితాల్ని మార్చేస్తుంది, వద్దంటే డబ్బులు

Gajalaxmi Rajayogam Effect: హిందూ పంచాంగం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనానికి అత్యంత మహత్యమున్నట్టే చంద్ర గ్రహణానికి కూడా ప్రాధాన్యత ఉంది. చంద్ర గ్రహణం కంటే ముందే గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈ ప్రభావం 5 రాశులపై కనకవర్షం కురిపించనుంది.

ఏప్రిల్ 22వ తేదీన గురు గ్రహం మేషరాశిలో ప్రవేశించేటప్పటికి ఆ రాశిలో రాహువు ఉపస్థితుడై ఉన్నాడు. రాహువు, గురువు ఏదైనా రాశిలో కలిసినప్పుడు గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుందంటారు. మరోవైపు మే 5 వ తేదీన బుద్ధ పూర్ణిమ ఉంది. చంద్ర గ్రహణం సమయంలో సైతం ఈ యోగం ప్రభావం ఉంటుంది. జీవితంలో డబ్బులు సంపాదించేందుకు ఇదే అనువైన సమయం. లక్ష్మీదేవి కటాక్షం కొన్ని జాతకాలపై ఉంటే..మరి కొందరికి ఏమీ దక్కదు. కొందరి కుండలి ప్రకారం బాధలు, కష్టాలు వెంటాడుతుంటాయి. మే 5వ తేదీన 2023 అంటే ఈ ఏడాదిలో తొలి చంద్ర గ్రహణం ఉంది. ఈ చంద్ర గ్రహణం కంటే ముందే అత్యంత శుభ సూచకమైన గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. 

హిందూమత విశ్వాసాల ప్రకారం గ్రహాలకు గురువుగా భావించే గురు గ్రహం మేష రాశిలో ప్రవేశించే సమయానికి అక్కడ రాహువు ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడు ఏ రాశిలో కలిసినా గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా 5 రాశులపై కనకవర్షం కురవనుంది. పెద్దఎత్తున ధనలాభం కలగనుంది. 

తులా రాశి

రాహు, గురు గ్రహాల కలయికతో ఏర్పడిన గజలక్ష్మీ రాజయోగం ప్రభావం తులా రాశి జాతకులకు పూర్తిగా లాభం కల్గించనుంది. ఈ సందర్భంగా దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. అంతేకాకుండా పూర్వీకుల సంపద కలిసొస్తుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. అంతులేని ధనలాభం కలుగుతుంది.

మిథున రాశి

చంద్ర గ్రహణం కంటే ముందే ఏర్పడనున్న గజలక్ష్మీ రాజయోగం ప్రభావంతో మిథున రాశి జాతకులకు ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. భారీగా డబ్బులు వచ్చి పడటంతో ఆర్ధికంగా బలోపేతమౌతారు. వృత్తిరీత్యా జీవితంలో మంచి పరిణామాలుంటాయి. ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏ సమస్యా ఉండదు.

మీన రాశి

మీన రాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో కలిసొస్తుంది. ఉద్యోగస్థులకు పదోన్నతి లభిస్తుంది. ఈ సమయంలో ఖర్చులు మాత్రం తగ్గించుకోవల్సి వస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. 

కన్యా రాశి

గజలక్ష్మీ రాజయోగం ప్రభావంతో కన్యా రాశి జాతకులకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. అంతేకాకుండా ఆర్ధికంగా పటిష్ట స్థితిలో ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఆర్జిస్తారు. దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడపగలుగుతారు.

కర్కాటక రాశి

గజలక్ష్మీ రాజయోగం ప్రభావంతో కర్కాటక రాశి జాతకులకు అత్యంత అనుకూలమైన సమయం. భారీగా డబ్బులు వచ్చి పడతాయి. వ్యాపారస్థులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలుంటాయి. అంతేకాకుండా అదృష్టం తోడుగా ఉంటుంది. ఆర్ధికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యపరంగా అన్ని సమస్యలు తొలగిపోతాయి.

Also read: Venus Transit 2023: శుక్ర గోచారం ప్రభావం, మే 2 నుంచి ఆ రాశికి తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News