Ravi Teja Ravanasura OTT మాస్ మహారాజా తన కెరీర్‌లో ప్రయోగాలు చేస్తూనే వస్తున్నాడు. ఆ ప్రయోగాలు హిట్టైనా, ఫట్టైనా కూడా ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. తన కెరీర్‌లో ప్రయోగాలు అనేవి ఎక్కువగా సక్సెస్ కాలేదు. రావణాసుర కూడా ఓ రకంగా ప్రయోగమే. ప్రథమార్థం అంతా కూడా విలన్‌గా అనిపిస్తాడు. నెగెటివ్ షేడ్స్‌లో మెప్పించే ప్రయత్నం చేశాడు. అయితే సెకండాఫ్‌కు వచ్చే సరికి రొటీన్ సినిమాలా మారుతుంది. విలన్ కాస్తా హీరోలానే కనిపిస్తాడు.
రావణాసుర మూవీ బాక్సాఫీస్ వద్ద ఆడకపోయినా.. నీ యాక్టింగ్‌తో ఫుల్ శాటిస్‌ఫై అయిపోయా అన్నా అంటూ రవితేజ ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. అమర్ అక్బర్ ఆంటోని, రావణాసుర, డిస్కో రాజా ఇలా ప్రతీ సారి ప్రయోగాలు చేస్తూనే ఉన్నా.. జనాలు మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతోన్నారు.. వాటికంటే మాస్ మసాలా కమర్షియల్ సినిమాలు చేస్తేనే ఆదరిస్తున్నారు అని కామెంట్లు చేస్తున్నారు.
#Raviteja Anna inka eppudu kuda expérimental movies cheyyaku like #AAA, #Ravanasura,#DiscoRaja mana telugu audions encourage cheyyaru.adhe tamil,hollywood movies ni ayithe Sollu karchukuntu chustaru 🤦.
Rotta routine movies >>>New stories mana audions ki.@RaviTeja_offl pic.twitter.com/ef9Sclb9QW— నేనింతే రా 🤙 (@Obulesh73991245) April 28, 2023
ఈ సినిమాను ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ చిత్రం థియేటర్లో అంతగా ఆడలేదు. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ధమాకా, వాల్తేరు వీరయ్య తరువాత హ్యాట్రిక్ కొడతాడని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. రావణాసుర సినిమాతో మళ్లీ ఫ్లాపుల పరంపర మొదలయ్యేలా ఉందని అంతా అనుకుంటున్నారు. రవితేజ మాత్రం ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూనే పోతోన్నాడు.
Also Read: Samantha Birthday : సమంత బర్త్ డే.. ఐ లవ్యూ అంటూ ప్రీతమ్ పోస్ట్
రావణాసుర ఫలితం మీద కూడా రవితేజ ఫన్నీగానే రియాక్ట్ అయ్యాడట. ఓహో సినిమా పోయిందా? అని చిన్నగా నవ్వేశాడట. అలా రవితేజ తన సినిమాల ఫలితాల గురించి ఎక్కడా కూడా స్ట్రెస్ తీసుకుంటున్నట్టుగా కనిపించడం లేదు. రవితేజ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అంటూ మరో ప్రయోగం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రేణూ దేశాయ్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. హేమలతా లవణం అనే కారెక్టర్‌లో రేణూదేశాయ్ కనిపించనుంది.
Also Read: Agent Twitter Review : ఏజెంట్ ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టిన అయ్యగారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook