Summer Drinks for beating Heat Wave in India: ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్యలు, విపరీతమైన చెమటలు పట్టడం సర్వసాధారణం. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చెడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యల కారణంగానే ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలు వస్తున్నాయి. దీనిని సాధారణ భాషలో కడుపులో వేడి అని కూడా అంటారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో లభించే పలు మూలికల ద్వారా కూడా ఈ పొట్ట సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎలాంటి ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
పుదీనా ఆకులతో తయారు చేసిన నీరు:
పుదీనా ఆకులు, దోసకాయ ముక్కల్లో ఉండే గుణాలు తీవ్ర పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా తగ్గిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు పుదీనా ఆకులు, దోసకాయ ముక్కలను నీళ్లలో వేసి బ్లెండ్ చేసి, అందులో నిమ్మరసం వేసి కలుపుకుని తాగాల్సి ఉంటుంది. ఇలా వేసవిలో తాగడం వల్ల శరీర హైడ్రేట్‌గా ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
అల్లం:
జీర్ణక్రియ, పొట్టకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అల్లం, దోసకాయ రైతా ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందలో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి తీసుకుంటే రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మెంతులు, సోంపు గింజలు:
మెంతి, సోంపు గింజల్లో ఉండే గుణాలు మధుమేహాన్ని నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి పొట్టలో పేగులను ఆరోగ్యంగా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీని కోసం మెంతి గింజలను రాత్రి నానబెట్టి, ఉదయాన్నే ఈ నీటిని తాగండి. ఇలా ప్రతి రోజూ చేస్తే వేసవిలో హెల్తీగా ఉంటారు.
గ్రీన్ ఏలకులు:
పచ్చి ఏలకులు ఆహారానికి రుచిని అందించడమేకాకుండా చాలా రకాల పొట్ట సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. వేసవిలో పచ్చి ఏలకుల టీ తాగడం వల్ల పొట్టకు మేలు జరగడమేకాకుండా జీర్ణక్రియ సమస్యలను తగ్గించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook