Lowest Strike Rate Batsman in IPL 2023: ఐపీఎల్లో హైస్కోరింగ్ గేమ్‌ల కంటే లోస్కోరింగ్ మ్యాచ్‌లే ఎక్కువగా ఉత్కంఠను రేపుతాయి. ప్రత్యర్థి టీమ్‌ను తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేసి.. లక్ష్యం తక్కువగా ఉందని ఛేజింగ్‌లో నెమ్మదిగా ఆడి చివరకు సీన్ రివర్స్ అయిన ఎన్నో మ్యాచ్‌లు చూశాం. తాజాగా గుజరాత్-లక్నో జట్ల మధ్య కూడా ఇలానే జరిగింది. గుజరాత్ 20 ఓవర్లలో 135 రన్స్ చేయగా.. లక్నో 128 పరుగులకే పరిమితమైంది. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి వరకు నెమ్మదిగా ఆడి.. జట్టు ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ రేసులో ఉన్న ఆటగాళ్లు తక్కువ స్ట్రైక్ రేట్‌తోనే రన్స్ చేస్తున్నారు. టీ20ల్లో టాపార్డర్ బ్యాట్స్‌మెన్ స్టైక్ రేట్ 150 పైగా ఉంటే.. ఆ జట్టు కచ్చితంగా భారీ స్కోరు చేస్తుంది. ఈ సీజన్లో అత్యధిక పరుగులతో టాప్ 10లో ఉండి.. స్టైక్ రేట్ తక్కువగా ఉన్న ఐదుగురి ఆటగాళ్లపై ఓ లుక్కేయండి.
చెన్నై మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 6 గేమ్‌లలో 47 సగటుతో 235 రన్స్ చేశాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో 8వ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం టాప్ టెన్ బ్యాట్స్మెన్లలో అత్యల్ప స్ట్రైక్ రేట్లో ఐదో స్థానంలో ఉన్నాడు. గైక్వాడ్ 144.17 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేస్తున్నాడు.
ఈ సీజన్ ఆరంభంలో విఫలమైన చెన్నై ఓపెనర్ డెవాన్ కాన్వే పుంజుకున్నాడు. వరుస అర్ధ సెంచరీలతో చెన్నైను గెలుపు తీరాలకు చేరుస్తున్నాడు. 144.13 స్టైక్‌రేట్‌తో రన్స్ చేస్తున్నాడు.
విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్న స్ట్రైక్ రేట్ కాస్త తక్కువగా ఉంది. కోహ్లీ 6 మ్యాచ్‌ల్లో 279 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 142.34 స్ట్రైక్ రేట్‌తో అత్యధిక పరుగులు చేస్తున్నాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ కూడా స్లో బ్యాటింగ్‌పై విమర్శలు వస్తున్నాయి. 6 మ్యాచ్‌ల్లో 285 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నా.. స్ట్రైక్ రేట్ 120.76 మాత్రమే ఉంది.
లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ సీజన్లో పరుగులు చేస్తున్నా.. నెమ్మదిగా ఆడుతూ విమర్శల పాలవుతున్నాడు. కేవలం 113.91 స్ట్రైక్ రేట్‌తో రన్స్ చేస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఓటమికి రాహుల్ స్లో బ్యాటింగే కారణమని క్రికెట్ అభిమానులు విమర్శిస్తున్నారు.