IPL 2023 Purple Cap: బ్యాట్స్‌మెన్ భరతం పడుతూ.. పర్పుల్ క్యాప్‌ రేసులో దూసుకుపోతున్న బౌలర్లు వీళ్లే.. 

Purple Cap in IPL 2023: ఈ సీజన్‌లో బౌండరీల వరద పారుతున్నా.. బౌలర్లు సత్తాచాటుతూ బ్యాట్స్‌మెన్ జోరుకు కళ్లెం వేస్తున్నారు. పర్పుల్ క్యాప్‌ రేసులో ఉన్న ఐదుగురు బౌలర్లపై ఓ లుక్కేయండి. 

1 /5

ఈసారి ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆధిపత్యం చెలాయిస్తోంది. పేసర్ మహ్మద్ సిరాజ్ ఆరు మ్యాచ్‌లలో 12 వికెట్లతో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. సిరాజ్ 6.70 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు. 

2 /5

గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ ఈ సీజన్‌లో కూడా బ్యాట్స్‌మెన్ భరతం పడుతున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడు. సిరాజ్‌తో సమానంగా వికెట్లు తీసినా.. 8.29 ఎకానమీ రేటుతో రషీద్ రన్స్ ఇచ్చాడు.  

3 /5

లక్నో సూపర్‌ జెయింట్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ అదరగొడుతున్నాడు. నాలుగు మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో ఉన్నాడు.   

4 /5

గతేడాది పర్పుల్ క్యాప్ విన్నర్, రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈసారి కూడా రేసులో దూసుకువస్తున్నాడు. ఆరు మ్యాచ్‌ల్లో 11 వికెట్లతో మూడవ స్థానంలో ఉన్నాడు.  

5 /5

గుజరాత్ టైటాన్స్ పేస్ బౌలర్ షమీ ఐదు మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. టాప్-5 బౌలర్లలో ఒకడిగా ఉన్నాడు.