Summer Hair Loss: జుట్టులో చెమట పట్టడం వల్ల జుట్టు రాలుతుందా?, ఇలా చేస్తే 9 రోజుల్లో తగ్గుతుంది!

How To Solve Hair Fall Problem In Summer: జుట్టులో చెమట పట్టడం వల్ల సులభంగా జుట్టు రాలుతుంది. అంతేకాకుండా తీవ్ర జుట్టు సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ కింది 3 చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 21, 2023, 04:16 PM IST
Summer Hair Loss: జుట్టులో చెమట పట్టడం వల్ల జుట్టు రాలుతుందా?, ఇలా చేస్తే 9 రోజుల్లో తగ్గుతుంది!

How To Solve Hair Fall Problem In Summer: వేసవి వచ్చిందంటే చాలు చర్మ, జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి. అంతేకాకుండా వాతావరణంలో తేమ శాతం పెరిగి డీహైడ్రేషన్‌ సమస్యలు కూడా వస్తాయి. ప్రస్తుతం ఎండ కారణంగా చమట పెరిగిపోయి..హెయిర్‌ ఫాల్‌ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి సులభంగా ఉశమనం పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ప్రోడక్ట్స్‌ ఉన్నాయి. కానీ ఇవి ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. కాబట్టి వీటికి బదులుగా ఇంటి చిట్కాలు పాటించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి చిట్కాలను పాటించడం వల్ల జుట్టు రాలడం సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 

జుట్టులో చెమట సమస్యను ఇలా తగ్గించుకోండి:
షాంపూను సరైన సమయంలో వినియోగించండి:

వేసవిలో ప్రతి రోజు తల స్నానం చేయడం చాలా మంచిది. ఇలా చేసే క్రమంలో తప్పకుండా ఆర్గినిక్‌ షాంపులను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ప్రతి రోజు ఇలాంటి షాంపూలతో స్నానం చేయడం వల్ల జుట్టులో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా చమట సమస్యలు రాకుండా ఉంటాయి. కాబట్టి సమ్మర్‌లో ప్రతి రోజు తల స్నానం చేయాలి. 

Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?

ఆపిల్ వెనిగర్:
యాపిల్ వెనిగర్ శరీరానికి చాలా మేలు చేస్తుంది. ఇందలో ఉండే గుణాలు జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేడి నీటిలో కలిపి తలకు మసాజ్ చేసి..అలాగే 20 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది. ఆ తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. 

నిమ్మరసం:
నిమ్మరసంలో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. అయితే ఈ రసాన్ని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు దుర్వాసన సులభంగా దూరమవుతుంది. దీనిని అప్లై చేయడానికి ముందుగా ఒక నిమ్మకాయను తీసుకోవాల్సి ఉంటుంది. వాటి నుంచి రసం తీసి.. నీటిలో కలపాల్సి ఉంటుంది. అందులోనే ఆపిల్ వెనిగర్ వేసి జుట్టుకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సమ్మర్‌లో జుట్టు రాలడం సమస్యలు దూరమవుతాయి. 

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Social Media Followers: ట్విట్టర్‌లో పవన్.. ఫేస్‌బుక్‌లో సీఎం జగన్ టాప్.. ఎవరికి ఎంతమంది ఫాలోవర్లు అంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News