Soaked Dry Fruits For Hair Loss, Joint Pain, Constipation: నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు శరీరానికి పోషకాలను అదించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజూ నీటిలో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అయితే ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. నీటిలో నానబెట్టి డ్రై ఫ్రూట్స్‌ను రాత్రి పూట తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఎండు ద్రాక్షలను ఇలా తినండి:
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టకుండా కూడా తీసుకోవచ్చు. ఇందులో ఐరన్ పరిమాణం అధికంగా లాభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల జుట్టు రాలడం చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే వీటిని నీటిలో నానబెట్టీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందొచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
బాదంపప్పు:
బాదంపప్పులో ఉండే మూలకాలు మెదడును షార్ప్‌గా చేయడానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా పెరుగుతున్న బరువును కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు, బరువు తగ్గాలనుకునేవారు తప్పకుండా బాదం పప్పులను తీసుకోవాల్సి ఉంటుంది. రక్తపోటు సమస్యలతో బాధపడేవారు క్రమం తప్పకుండా ఈ బాదం పప్పును నీటిలో నానబెట్టి తీసుకుంటే సులభంగా ఉపశమనం లభిస్తుంది.
అంజీర్:
అంజీర్ పండ్లలో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ల లభిస్తాయి. కాబట్టి తీవ్ర వీటిని ప్రతి రోజూ పాలతో పాటు తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా డిన అంజీరను రాత్రి నీటిలో లేదా పాలలో నానబెట్టి ఉదయం తినండి.
అవిసె గింజలు:
ఈ గింజలలో కూడా శరీరానికి అవసరమైన ప్రోటీన్, ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించడానికి కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఆహారాల్లో అవిసె గింజలను నీటిలో నానబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది.
మెంతి గింజలు:
మెంతి గింజలు మధుమేహంతో బాధపడుతున్నవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. తరచుగా మలబద్ధకం సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఒక గ్లాసు నీటిలో మెంతి గింజలను రాత్రంత నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook