Australia Squad For WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌కు కంగారూ జట్టు సిద్ధమైంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌తోపాటు ఇంగ్లాండ్‌తో జరిగే యాషెస్ సిరీస్‌కు జట్టును ప్రకటించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియాతో ఆసీస్ తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 7వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్‌లో జరుగనుంది. ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్‌తో కంగారూ జట్టు ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జూన్ 16 నుంచి ప్రారంభంకానుంది. ఈ రెండు మెగా టోర్నీలకు 17 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఇటీవల భారత్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను 0-2తో ఆసీస్ ఓడిపోయిన విషయం తెలిసిందే. తన తల్లి అనారోగ్యం కారణంగా టీమిండియాతో సిరీస్ నుంచి మధ్యలో నుంచి వెళ్లిపోయిన కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తిరిగి జట్టులోకి వచ్చాడు. కెప్టెన్‌గా అతనే వ్యవహరించనున్నాడు. అదేవిధంగా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్, బ్యాట్స్‌మెన్ మార్కస్ హారిస్ మళ్లీ టెస్టు జట్టులోకి వచ్చారు. 2019లో చివరి టెస్టు ఆడిన మిచెల్ మార్ష్.. చాలా గ్యాప్ తరువాత జట్టులో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మార్ష్ అదరగొట్టాడు. దీంతో టెస్టు జట్టులోకి లైన్ క్లియర్ అయింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జోష్ ఇంగ్లిస్ తొలిసారి టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.
గాయం కారణంగా టీమిండియాతో చివరి రెండు టెస్టులకు దూరమైన డేవిడ్ వార్నర్ కూడా జట్టులో స్థానం నిలబెట్టుకున్నాడు. జట్టులో నలుగురు పేసర్లకు ప్లేస్ దక్కింది. కెప్టెన్ పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్, స్కాట్ బోలాండ్‌లను ఎంపిక చేసింది. కామెరూన్ గ్రీన్, మిచెల్ మార్ష్ ఫాస్ట్ బౌలింగ్ వేయగలరు. నాథన్ లియోన్, టాడ్ మర్ఫీల జంట స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
Will this Australia squad be able to win the #WTC23 Final and conquer England in the Ashes? 🤔
More 👉 https://t.co/LMpdOwv0ro pic.twitter.com/xTVXaT6NbN
— ICC (@ICC) April 19, 2023
Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), డేవిడ్ వార్నర్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, టాడ్ మర్ఫీ, మాథ్యూ రెన్షా, మిచెల్ స్టార్క్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook