Zero Tax for 12 Lakhs Income: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో కొత్త రూల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇక పన్ను చెలింపుదారులు జూలై 31వ తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఫామ్-16ను పూర్తి చేసి ఖర్చుల వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేసేముందు మీరు ఏయే పథకాలలో ఇన్వెస్ట్ చేశారో కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్ల వరకు మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ అందిస్తాయి. మీ జీతం రూ.12 లక్షలు అయితే.. ఒక్క కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
ట్యాక్స్ సేవ్ చేయాంటే కచ్చితంగా ముందస్తు ప్రణాళిక అవసరం. మీరు ఎలా ట్యాక్స్ సేవ్ చేసుకోవాలో నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు. మీ శాలరీ నుంచి ట్యాక్స్ అమౌంట్ కట్ అయితే.. ఐటీఆర్ ఫైల్ చేసి మళ్లీ ఆ డబ్బును తిరిగి పొందొచ్చు. మీ జీతం ఏడాదికి 12 లక్షల ఉంటే.. 30 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్లు 30 శాతం పన్ను చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ.12 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవడం ఉత్తమం. పూర్తి లెక్కలు ఇవే..
==> ప్రతి కంపెనీ ఉద్యోగులకు 2 రకాలు శాలరీ చెల్లిస్తుంది. పార్ట్-ఎ, పార్ట్-బి లేదా పార్ట్-1, పార్ట్-2గా జీతం డివైడ్ అవుతంది. పార్ట్-ఎ లేదా పార్ట్-1 వచ్చే శాలరీపై ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా రూ.12 లక్షల శాలరీలో రెండు లక్షల రూపాయలు పార్ట్-బి లేదా పార్ట్-2లో ఉంటుంది. అప్పుడు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.10 లక్షలు అవుతుంది.
==> స్టాండర్డ్ డిడక్షన్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన రూ.50 వేలు తీసిస్తే.. ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.9.50 లక్షలకు తగ్గుతుంది.
==> ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 80సీ కింద మీరు రూ.1.5 లక్షల వరకు పొదుపును క్లెయిమ్ చేసుకోవచ్చు. ట్యూషన్ ఫీజు, ఎల్ఐసీ, పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్, ఈపీఎఫ్ లేదా హోమ్ లోన్ మొదలైనవాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. రూ.1.5 లక్షలు తీసిస్తే.. పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.8 లక్షలు అవుతుంది.
==> ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 24బీ కింద హోమ్ లోన్ వడ్డీపై రూ.2 లక్షల మినహాయింపు పొందుతారు. అప్పుడు మీరు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.6 లక్షలకు తగ్గుతుంది.
==> 80సీసీడీ (1బీ) కింద నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)లో రూ.50 వేలు ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఆదాయ పన్ను పరిధిలోకి రూ.5.5 లక్షలు ఉంటుంది.
==> ఆదాయపు పన్ను సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లలు, భార్య కోసం రూ.25 వేల వరకు, తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు అయితే ప్రీమియంగా రూ.50 వేలు క్లెయిమ్ చేయవచ్చు. ఈ రెండింటిని రూ.75 వేలు తగ్గిస్తే.. మీ ట్యాక్స్ పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.4.75 లక్షలు అవుతుంది.
==> రూ.2.5 లక్షల నుంచి రూ.4.75 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం రూ.2.25 లక్షలపై రూ.11,250 ట్యాక్స్ చెల్లించాలి. కానీ రూ.12,500 వరకు పన్నుపై ఆర్థిక మంత్రిత్వ శాఖ రిబేటు ఇస్తుంది. ఇలా మీరు రూ.12 లక్షల శాలరీ రూపాయి కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్ అమలుకు నోటిఫికేషన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook