Trimukha: సన్ని లియోన్ బాలీవుడ్, టాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీస్ లో నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె లీడ్ రోల్లో ‘త్రిముఖ' సినిమా చేస్తోంది. ఈ సినిమాతో యోగేష్ కల్లే హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు.
నటుడు యోగేష్ కల్లే పాన్-ఇండియా చిత్రం "త్రిముఖ"తో పరిచయం కాబోతున్నాడు. ఇందులో సన్నీ లియోన్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రంలో నాజర్, CID ఆదిత్య శ్రీవాస్తవ్, సుమన్, మొట్ట రాజేంద్రన్, ప్రవీణ్, అషు రెడ్డి లీడ్ రోల్స్ లో యాక్ట్ చేశారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘త్రిముఖ’ మూవీ ప్రెజెంట్ పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉంది. మార్చి 2025లో విడుదల కానుంది. ఈ సినిమాతో నటిస్తూన్న యోగేష్ కల్లే ఈ సినిమా విడుదల కాకముందే ‘చాణుక్యం’‘బెజవాడ బాయ్స్’ అనే మరో రెండు సినిమాలకు సైన్ చేశారు. హెబా పటేల్ కథానాయికగా నటిస్తున్న "చాణుక్యం" చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.
ఇందులో మోటా రాజేంద్రన్, సుమన్, వినోద్ కుమార్, దన్య బాలకృష్ణ, శ్రావణ్, నాగ మహేష్, ప్రభాకర్ వంటి ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ‘బెజవాడ బాయ్స్’ త్వరలో ప్రారంభం కానుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న "త్రిముఖ" చిత్రానికి రాజేష్ నాయుడు, శ్రీదేవి మద్దాలి ద్వయం డైరెక్ట్ చేస్తున్నారు. అకిరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్‌పై హర్ష కల్లే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: Prabhas Marriage: ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్.. డార్లింగ్ చేసుకోబోయేది ఈమెనే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.