Tees Maar Khan Movie Producer: '100 కోట్లు' ప్రొడ్యూసర్ బర్త్ డే వేడుకలు.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్

Producer Nagam Tirupathi Reddy: ఆది సాయికుమార్ తీస్ మార్ ఖాన్ మూవీతో ప్రొడ్యూసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నాగం తిరుపతి రెడ్డి. త్వరలోనే మరో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన వెల్లడించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 04:48 PM IST
Tees Maar Khan Movie Producer: '100 కోట్లు' ప్రొడ్యూసర్ బర్త్ డే వేడుకలు.. త్వరలోనే కొత్త ప్రాజెక్ట్

Producer Nagam Tirupathi Reddy: సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్‌గా అడుగు పెట్టడం అంటే సాహసం అని ఎంతోమంది చెప్పే మాట. చేతిలో డబ్బులు ఉంటే ప్రొడ్యూసర్ అయిపోవచ్చని పొరబాటే. సినిమా మీద ప్యాషన్‌తోపాటు మంచి స్టోరీలను ఎంచుకుని.. వాటిని ప్రేక్షకులకు అద్భుతమైన రీతిలో అందించాలనే ఆసక్తి ఉంటేనే నిర్మాతగా రాణించగలుగుతారు. అలాంటి ఓ విజన్‌తోనే ప్రొడ్యూసర్ డా.నాగం తిరుపతి రెడ్డి మూవీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆది సాయి కుమార్‌ 'తీస్ మార్ ఖాన్' మూవీతో మంచి ప్రశంసలు అందుకుని నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకులు, విజన్ గ్రూప్ అధినేత  డా.నాగం తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం తన కార్యాలయంలో నిర్వహించారు. 

ఈ సందర్భంగా నాగం తిరుపతి రెడ్డి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేయగా.. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. తిరపతి రెడ్డికి రావుల చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం నుంచి రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను నిరంజన్ రెడ్డి చేతుల ఆవిష్కరించారు. 

అనంతరం నిర్మాత డా.నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. తన పుట్టినరోజు వేడుకల కార్యక్రమానికి వచ్చిన నిరంజన్ రెడ్డితోపాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ఇప్పటివరకు చేస్తున్న సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తానని చెప్పారు. అందరికీ సేవ చేసే ఆ భాగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకున్నారు. ఈ ఏడాది మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీయనున్నట్లు వెల్లడించారు. 'డైరెక్టర్', '100 కోట్లు', 'తీస్ మార్ ఖాన్' వంటి సినిమాలతో ప్రొడ్యుసర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగం తిరుపతి రెడ్డి.. త్వరలోనే తన నాలుగో ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడికానున్నాయి.

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Tollywood 2023: ఈ ఏడాది లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు.. ఎవరెవరో తెలుసా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News