Sabari Director - Anil Katz: అందుకే ఈ మూవీకి 'శబరి' టైటిల్ పెట్టాము.. దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sabari Director - Anil Katz: విలక్షణ నటిమణి వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మూవీ 'శబరి'. ఈ మూవీకి 'శబరి' టైటిల్ ఎందుకు పెట్టారనే విషయమై దర్శకుడు అనిల్ కాట్జ్ మీడియాతో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.

Last Updated : Apr 29, 2024, 10:16 PM IST
Sabari Director - Anil Katz: అందుకే ఈ మూవీకి 'శబరి' టైటిల్ పెట్టాము.. దర్శకుడు అనిల్‌ కాట్జ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..

Sabari Director - Anil Katz: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ లీడ రోల్లో యాక్ట్ చేసిన  సినిమా 'శబరి'. ఈ సినిమాను మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల భారీ ఎత్తున నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ మూవీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ భారత్ లెవల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు 'శబరి' టైటిల్ పెట్టడం వెనక ఉన్న అసలు కారణాలను మీడియాతో పంచుకున్నారు.

నాలుగైదేళ్ల క్రితం 'శబరి' లైన్ మనసులోకి  వచ్చింది. 'ప్రాణానికి మించి మనం దేనిని అయినా ప్రేమిస్తే... అది ప్రాణం తీసేంత ద్వేషంగా మారే అవకాశం ఉంది'  ఇదీ నేను చెబుదామనుకున్న పాయింట్. మారుతున్న సమాజంలోనూ ప్రేమకు స్వచ్ఛమైన రూపం అమ్మ రూపంలో మాత్రమే ఉంది. పిల్లల విషయంలో చెడ్డ తల్లి ఉండదు. అమ్మ  ప్రేమలో నిజాయతీ ఉంటుంది. ఈ నేపథ్యంలో, తల్లి కుమార్తె ప్రేమ నేపథ్యంలో ఆ పాయింట్ చెబితే బావుంటుందని కథ రాసుకున్నాను.

'శబరి' టైటిల్ ఎందుకు పెట్టారు? ఆ పేరు ఎంపిక వెనుక కారణం ఏమిటి?
రామాయణం తీసుకుంటే శబరికి రాముడు సొంత కుమారుడు కాదు. ఆయన వస్తారని ఎన్నో ఏళ్లు ఎదురు చూసింది. రుచిగా ఉన్న ఫలాలు మాత్రమే ఇవ్వాలని, ఒకవేళ ఆ ఫలాల వల్ల ప్రమాదం ఉందేమోనని మంచి పండ్లను ఎంపిక చేసి రాముడికి అందజేసింది. ఆవిడ ప్రేమలో ఓ నిజాయతీ ఉంది. ఏపీలో శబరి పేరుతో నది ఉంది. కేరళలో శబరిమల పుణ్యక్షేత్రం అందరికీ తెలుసు. సంస్కృతంలో శబరి అంటే 'ఆడ పులి' అని అర్థం. నా ప్రధాన పాత్రలో ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయి. అందుకనే ఆ టైటిల్ పెట్టాను.

వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ రోల్‌కు సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ?
స్త్రీ ప్రధాన పాత్రల్లో చేయగల సత్తా ఉన్న ఆరిస్టులు మన దగ్గర చాలా  తక్కువ మంది ఉన్నారు. ఆ కొందరిలో 'శబరి' లాంటి సబ్జెక్ట్ చేయగల సత్తా ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.ఈ సినిమాలో అన్ని వేరియేషన్స్ పండించారు వరలక్ష్మి. 'పందెం కోడి 2', 'తార తప్పటై', 'విక్రమ్ వేద', 'సర్కార్'లో ఆమె నటన చూశాను. ఆవిడ హీరోయిన్ గా సినిమాలు చేశారు. ఒక్కసారి హీరోయిన్ అయ్యాక ఆ తరహా రోల్స్ చేయాలని చూస్తారు. కానీ, వరలక్ష్మి గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేశారు. ఆవిడ ఇంటర్వ్యూలు చూశాను. ఆఫ్ స్క్రీన్ ఆమె క్యారెక్టరైజేషన్ నచ్చింది. మనం కథలో చెప్పాలనుకున్న విషయాలను ఆరిస్టులు నమ్ముతున్నారా? లేదా? అనేది చాలా ఇంపార్టెంట్. నమ్మితేనే ముఖంలో కనిపిస్తుంది. సినిమాకు హెల్ప్ అవుతుంది. దర్శకుడిగా ఆ స్వార్థంతో వరలక్ష్మిని సంప్రదించాను. చెన్నైలో కథ చెప్పినప్పుడు సింగిల్ సిట్టింగ్ లో ఓకే చేశారు. పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ చెప్పలేదు.

వరలక్ష్మి గారితో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
వరలక్ష్మి దర్శకులు నటి. ఆవిడ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో చేశారు కనుక కెమెరా, షాట్స్ గురించి అవగాహన ఉంది. ఎక్కువ వివరించాల్సిన అవసరం ఉండదు.

వరలక్ష్మి గారు కథ ఓకే చేశాక నిర్మాత దగ్గరకు వెళ్లారట!
నచ్చిన ఆర్టిస్ట్ దొరికినప్పుడు ఆ ఆర్టిస్టుకు తగ్గ నిర్మాత దొరకాలి. మనం అనుకున్న విధంగా తీయడానికి సపోర్ట్ చేసే ప్రొడక్షన్ హౌస్ దొరికింది.  అటువంటి నిర్మాత నాకు లభించడానికి కొంత టైమ్ పట్టింది. లక్కీగా మహేంద్రనాథ్ నాకు పరిచయం అయ్యారు. అప్పటికి ఆయన ఒక ప్రాజెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు. వరలక్ష్మి కథ ఓకే చేశారని తెలిసి సినిమా స్టార్ట్ చేద్దామన్నారు.

శశాంక్ గారు, గణేష్ వెంకట్రామన్ గారు... ఇతర ఆరిస్టుల గురించి!
వరలక్ష్మి శరత్ కుమార్ గారి కుమార్తెగా బేబీ నివేక్ష నటించారు. శశాంక్ గారు మంచి రోల్ చేశారు. ప్రేక్షకులకు రిప్రజెంటేషన్ తరహాలో ఉంటుంది. థ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. గణేష్ వెంకట్రామన్ గారు కీలక పాత్ర చేశారు. హీరోయిన్ మానసిక పరిస్థితి ఆ విధంగా అవ్వడానికి కారణమయ్యే పాత్ర చేశారు. ప్రస్తుత సమాజంలో కొన్ని క్యారెక్టర్లు రిప్రజెంట్ చేసేలా ఉంటుంది. మిగతా ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు.

ఆల్రెడీ రిలీజైన సాంగ్స్ హిట్ అయ్యాయి. గోపీసుందర్ గారి మ్యూజిక్ గురించి!
'ఎంత మంచివాడవురా' చేసినప్పుడు ఆయన పరిచయం ఏర్పడింది. మా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఆయన ఇతర భాషల్లో చేసే సినిమాల పాటలు కూడా నాకు పంపిస్తారు. ముందు సిట్యువేషన్స్ చెప్పాను. మంచి సాంగ్స్ ఇచ్చారు.

ముందు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయ్యిందనేది నిజమేనా?
కథ విశాఖ పట్నం నేపథ్యంలో సాగుతుంది. అంటే కథ రాసేటప్పుడు హిల్ స్టేషన్ బ్యాక్ డ్రాప్ అనుకున్నాను. థ్రిల్లర్ సినిమాల్లో హిల్ స్టేషన్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. వరలక్ష్మి గారు మాకు డేట్స్ ఇచ్చిన టైంలో మేం విశాఖ వెళ్లేటప్పటికి అక్కడ వాతావరణం మేం కోరుకున్న విధంగా లేదు. అప్పుడు కొడైకెనాల్ వెళ్లాం. అందువల్ల కొంత బడ్జెట్ ఎక్కువైంది.

పాన్ ఇండియా రిలీజ్ చేయాలని ముందు నుంచి అనుకున్నారా?
నేను కథ అనుకున్నప్పుడు తెలుగులో తీయాలని అనుకున్నాను. వరలక్ష్మి గారికి తమిళ్ మార్కెట్ ఉంది కనుక తెలుగు, తమిళ భాషల్లో చేస్తే బావుంటుందని అనుకున్నాను. మా నిర్మాత మహేంద్రనాథ్ వచ్చిన తర్వాత పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అయ్యాము. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలు అయ్యింది. కథలో యూనివర్సల్ అప్పీల్, ఆ పొటెన్షియల్ ఆయన చూశారు. నేను ఓకే అన్నాను.

ఫైనల్లీ... 'శబరి' గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?
మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా అని నమ్ముతున్నాను. మిగతా ప్రపంచాన్ని, మన బాధల్ని మర్చిపోయి చూస్తాం కదా! ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని 'శబరి' తీశాను. ఇది థ్రిల్లర్ మాత్రమే కాదు... చాలా ఎమోషన్స్ ఉన్నాయి. కేవలం భయపెట్టాలని ప్రయత్నిస్తే ప్రేక్షకులు థ్రిల్ అవ్వరు. తెరపై పాత్రలతో కనెక్ట్ అవ్వాలి. అది పాత్రలో ప్రేక్షకుడు తనని తాను ఊహించుకోవాలి. అప్పుడు థ్రిల్ వర్కవుట్ అవుతుంది. 'శబరి' మంచి థ్రిల్ ఇస్తుంది.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News