Fear Movie Review: ‘ఫియర్’ మూవీ రివ్యూ రేటింగ్.. మెప్పించిందా..!

Fear Movie Review: తెలుగు సహా వివిధ భాషల్లో మాస్, క్లాస్ చిత్రాలతో పాటు హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాలకు ఎపుడు మంచి గిరాకీ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెరకెక్కిన మరో హార్రర్ చిత్రం ‘ఫియర్’. తాజాగా ఈ సినిమా నేడు విడుదలైంది. మరి తెలుగు ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో చూద్దాం..  

Written by - TA Kiran Kumar | Last Updated : Dec 14, 2024, 01:46 PM IST
Fear Movie Review: ‘ఫియర్’ మూవీ రివ్యూ రేటింగ్..  మెప్పించిందా..!

రివ్యూ : ఫియర్ (Fear)

తారాగణం : వేదిక, అరవింద్ కృష్ణ, పవిత్ర లోకేష్, అనీష్ కురువిల్లా జయ ప్రకాష్, సాహితి దాసరి తదితరులు

ఎడిటర్ : హరిత గోగినేని

సంగీతం : అనూప్ రూబెన్స్

సినిమాటోగ్రఫీ : ఐ ఆండ్ర్యూ

నిర్మాతలు : డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి

రచన, దర్శకత్వం : హరిత గోగినేని

కొన్ని సినిమాలు విడుదలకు  ముందే  మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా యాక్షన్ కమర్షియల్ చిత్రాలకు ఇలాంటి బజ్ ఉంటుంది. కానీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ‘ఫియర్’ మూవీ కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసింది. కొత్త దర్శకుడు హరిత గోగినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వేదిక ముఖ్యపాత్రలో నటించింది. ఈ శనివారం విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్స్ తో మంచి టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ మూవీ ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే :

ఇందు, సింధు (వేదిక - ద్విపాత్రాభినయం) కవలలు. సింధుకు ఇందు అంటే చాలా ఇష్టం. కాకపోతే సింధుకు చిన్నప్పటి నుంచే కొన్ని విపరీతమైన భయాలుంటాయి. ఎవరో తనని వెంటాడుతున్నట్టు అనుమానిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సింధు తన తోటి కాలేజీ నేస్తమైన సంపత్ (అరవింద్ కృష్ణ)ను లవ్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన ప్రేమించిన వ్యక్తి తన సొంతమే అన్నట్టు భావిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో అతనితో ఎవరితో మాట్లాడిన సహించనటు వంటి సైకో లాంటి ప్రేమ. ఈ నేపథ్యంలో  ఆమె మెంటల్ కండిషన్ బాగా లేదని కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. ఈ క్రమంలో తను ప్రేమించిన సంపత్ కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలో తన సోదరి ఇందు జాడా ఎక్కడా కనిపించదు. అసలు వాళ్లు ఎక్కడి వెళ్లారు. సింధును భయపెడుతున్నది ఎవరనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విషయానికొస్తే..

సాధారణంగా హార్రర్ చిత్రాలంటే ఏదో తీరని కోరికతో చనిపోయిన వ్యక్తి ఆత్మ మరొకరిలో ప్రవేశించి తన ప్రతీకారాన్ని తీర్చుకోవడం అనే కాన్సెప్ట్ లోనే  సాగుతుంది. కానీ ‘ఫియర్’ చిత్రాన్ని దానికి కాస్త భిన్నంగా తెరకెక్కించారు. ఇందులో కథ కంటే కథనంతోనే మెప్పించారు దర్శకులు. అంతేకాదు ఆడియన్స్ అంచనాలను అందకుండా సరికొత్త స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. టైటిల్ కు తగ్గట్టే ఈ సినిమా ప్రేక్షకులకు ఓ రకమైన ఫియర్ కలుగజేస్తోంది. సినిమా పైగా కమాండ్ ఉంటే తప్ప ఇలాంటి సబ్జెక్ట్స్ ను డీల్ చేయడం అంత ఆషామాషీ కాదు. కానీ హరిత గోగినేని ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకులను భయపెట్టేలా చేసి మంచి మార్కులు కొట్టేసింది.

కథలో ఒక పాయింట్ ను నెక్ట్స్ సీన్ తో లింక్ చేస్తూ అద్భుతమైన ట్విస్టులో సాగే స్క్రీన్ ప్లే సాగే సినిమా. లేడీ డైరెక్టర్స్ అంటే మాములుగా ఫ్యామిలీ, లవ్ సబ్జెక్ట్స్ ను డైరెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈమె మాత్రం తొలి సినిమానే హార్రర్ నేపథ్యాన్ని ఎంచుకోవడం ఒక ఎత్తు అయితే.. దాన్ని తెరపై ఎగ్జిక్యూట్ చేసిన విధానం మరో ఎత్తు అని చెప్పాలి. మొత్తంగా సినిమా చివర్లో ప్రేక్షకుకు ఇచ్చే సందేశం బాగుంది.

హార్రర్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలకు ఆర్ఆర్ ప్రాణం అని చెప్పాలి. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ అందించారు. కొన్ని సన్నివేశాల్లో ఆర్ఆర్ తో ప్రేక్షకులను భయపెట్టాడు. అటు ఎడిటర్ గా హరిత ఈ సినిమాను ప్రేక్షకులకు ఏ మేరకు సినిమా కావాలో ఆ మేరకే అందింది. ఓ రకంగా డైరెక్టర్ కంటే ఎడిటర్ గా ఆమె పై చేయి సాధించిందనే చెప్పాలి. సినిమా నిర్మాణ విలువలు.. ఫోటోగ్రఫీ రిచ్ గా ఉంది.

నటీనటుల విషయానికొస్తే..

ఒక సినిమాకు కథ, కథనంతో పాటు అందులో నటించే నటీనటులు నటన కూడా అంతే రీతిలో సహాయ పడుతోంది. ఇందులో వేదిక రెండు విభిన్న పాత్రలో ఎంతో ఈజ్ తో నటించింది. అన్ని రకాల ఎమోషన్స్ ను పండించింది. రకరకాల వేరియేషన్స్ ను చూపించింది. అరవింద్ ఉన్నంతలో పర్వాలేదనపించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

పంచ్ లైన్.. ‘ఫియర్’.. ప్రేక్షకులను ఆకట్టుకునే ఫ్యామిలీ ఎంటర్టైనర్

రేటింగ్ : 2.75/5

ఇదీ చదవండి: ఫామ్ హౌస్ రౌడీ.. ఆది నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదం..

ఇదీ చదవండి: Nagababu Cabinet: ముగ్గురు మొనగాళ్లు.. దేశంలోనే మొదటిసారి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News