World Wildlife Day significance: వైల్డ్ లైఫ్ గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న వైల్డ్ లైఫ్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఆహారం అలాగే ఔషధాలు మాత్రమే కాకుండా, వైల్డ్ లైఫ్ నుండి మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాకుండా వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచడంలో వన్యప్రాణులు కూడా సహాయపడతాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతున్న జాతుల వృక్షజాలం, జంతుజాలం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవాన్ని మొదటిసారిగా 3 మార్చి 2014న జరుపుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల జంతువులు మరియు మొక్కలు నెమ్మదిగా కనుమరుగవుతున్నాయని అంచనా. ప్రస్తుతం, భారతదేశంలో 900 కంటే ఎక్కువ జాతుల జంతువులు ప్రమాదంలో ఉన్నాయి. సకాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు.
ఈ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎలా ప్రారంభమైంది?
20 డిసెంబర్ 2013న, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ, 68వ సెషన్‌లో, వైల్డ్ లైఫ్ రక్షణ గురించి అవగాహన కల్పించడానికి, అంతరించిపోతున్న జాతుల వృక్షజాలంపై అవగాహన పెంచడానికి ప్రతి సంవత్సరం మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. వైల్డ్ లైఫ్ అంతరించిపోకుండా నిరోధించడానికి వైల్డ్ ఏనుగుల సంరక్షణ చట్టం మొదటిసారిగా 1872 సంవత్సరంలో ఆమోదించబడింది.
ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవం 2023 థీమ్
ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో జరుపుకుంటారు. ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవం 2023 యొక్క థీమ్ "వైల్డ్ లైఫ్ సంరక్షణ కోసం భాగస్వామ్యాలు". 2022లో ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవం యొక్క థీమ్ "ఎకో సిస్టమ్ పునరుద్ధరణ కోసం కీలక జాతులను తిరిగి ప్రవేశపెట్టడం".
ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు?
ఆహారం,ఔషధాలే కాకుండా, వైల్డ్ లైఫ్ నుండి మనకు అనేక రకాల ప్రయోజనాలు లభిస్తాయి. వీటిలో ఒకటి వన్యప్రాణులు సమతుల్య వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడతాయి. రుతుపవనాలను క్రమబద్ధీకరించడం, సహజ వనరుల పునరుద్ధరణలో ఇవి సహాయపడతాయి. ప్రపంచ వైల్డ్ లైఫ్ దినోత్సవం ప్రతి సంవత్సరం పర్యావరణంలో జంతువులు, మొక్కల సహకారాన్ని గుర్తించడం ద్వారా భూమిపై జీవితానికి వన్యప్రాణుల ఉనికి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం కోసం జరుపుకుంటారు.
Also Read: Pm Kisan Yojana 2023: పీఎం కిసాన్ యోజన డబ్బు పడలేదా.. టెన్షన్ వద్దు.. ఇలా చేయండి చాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి