World Chocolate Day 2022: మారుతున్న జీవన శైలికారణంగా అధిక రక్తపోటు సమస్య సర్వసాధారణమైపోయింది. శరీరంలో రక్త పోటు తీవ్రత అధికంగా ఉంటే.. గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధి, స్ట్రోక్ చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీయోచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా రకాల మందులు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అయితే రోజూ పిల్లలు ఇష్టపడి తినే డార్క్ చాక్లెట్ ద్వారా కూడా అధిక రక్తపోటును నియంత్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. వీటిలో రక్తపోటును నియంత్రించడానికి అవసరమైన అన్ని గుణాలు అందులో ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా డార్క్ చాక్లెట్‌లో బయోయాక్టివ్ కాంపౌండ్స్ పరిమాణం అధికంగా ఉంటుంది. ఇది ముఖాన్ని మెరుగు పరిచేందుకు కృషి చేస్తుంది.
ముఖ్యంగా డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనోల్స్ గుణాలు బలమైన సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అంతేకాకుండా చర్మంలో రక్త ప్రసరణను మెరుగుపరచడానికి.. హైడ్రేట్‌గా ఉంచడానికి దోహదపడుతుంది. డార్క్ చాక్లెట్‌లో ఉండే పదార్థాలు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌ను తగ్గిస్తాయి. అంతేకాకుండా శరీరానికి విశ్రాంతిని కూడా కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే శరీరానికి ప్రశాంతత కావాలనుకునే వారు తప్పకుండా ఈ డార్క్ చాక్లెట్‌ను తినమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ రోజూ ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం..
డార్క్ చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
1. రోజుకు 30 నుంచి 60 గ్రాముల చాక్లెట్ తింటే.. BP నియంత్రణలో ఉంటుంది. వైట్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్‌లో పాలు, చక్కెర తక్కువగా ఉంటాయి. కావున వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రయోజనాలు లభిస్తాయి.
2. డార్క్ చాక్లెట్‌లో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని సులభంగా జీర్ణం చేయగలదు.
3. డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనోల్స్ అధికంగా ఉంటాయి. కావున శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడానికి ధమనుల లైనింగ్‌లు ప్రేరేపిస్తాయి.
4. రక్త ప్రవాహానికి నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది.
5. రక్తపోటు ప్రమాదాన్ని, రక్త పోటును నియంత్రిస్తుంది.
6. డార్క్ చాక్లెట్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి.
7. డార్క్ చాక్లెట్‌లో థియోబ్రోమిన్ ఉంటుంది. కావున దంతాల ఎనామిల్‌ను బలపరుస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో ఇలా చేయకండి.. ఈ విధంగా చేస్తే సమస్యలు తప్పవు..!
Also Read: Lalu Prasad Yadav's Health Condition: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. లేటెస్ట్ అప్‌డేట్స్
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook