Winter Skin Care: శీతాకాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. అదే సమయంలోవాతావరణం కారణంగా చర్మం దెబ్బతింటుంటుంది. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
అందుకే శీతాకాలంలో చర్మ సంరక్షణ చాలా కీలకం. ముఖ్యంగా గాలి కాలుష్యం ఎక్కువైనప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో కాలుష్యం కారణంగా చర్మంపై నేరుగా ప్రభావం పడుతుంది. అయితే పెరుగుతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌తో చర్మ సంరక్షణ చేసుకోవచ్చు. ముఖంపై మలినాలను శుభ్రం చేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్‌తో చలికాలంలో సైతం ముఖం నిగనిగలాడేలా చేసుకోవచ్చు. వాస్తవానికి సీజన్ ఏదైనా సరే స్కిన్ కేర్ అనేది చాలా అవసరం. అందుకే చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ఉత్పత్తులు వినియోగిస్తుంటారు. ఇవన్నీ కెమికల్ ఆధారితం కావడంతో తాత్కాలిక ప్రయోజనమే తప్ప శాశ్వత లాభం ఉండదు. అదే సమయంలో ప్రతికూల ప్రభావం పడవచ్చు. అందుకే కొన్ని చిట్కాలతో చాలా సులభంగా చర్మ సంరక్షణ చేసుకోవచ్చు.
పెరుగుతో ఫేస్ ప్యాక్ చేసేందుకు రెండు చెంచాల పెరుగు, అర చెంచా పసుపు చాలు. ముందుగా చిన్న గిన్నెలో పెరుగు, పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడీ మిశ్రమాన్నిముఖానికి, మెడ భాగంలో రాయాలి. కనీసం 10 నిమిషాలుంచి పూర్తిగా డ్రై అయిన తరువాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారంలో 2-3 సార్లు ఇలా చేస్తే చర్మం నిగారింపు వస్తుంది.
చలికాలంలో సాధారణంగానే కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా చర్మం కాంతి కోల్పోతుంటుంది. ఈ పరిస్థితుల్లో చర్మానికి కలిగి హాని తగ్గించడం, చర్మానికి కాంతి వచ్చే లా చేయడం చాలా అవసరం. దీనికోసం వారంలో 2-3 సార్లు పెరుగు ఫేస్ ప్యాక్ రాయడం వల్ల ఇందులో ఉండే పసుపు ముఖంపై పేరుకుపోయే జర్మ్స్, ధూళిని శుభ్రం చేస్తుంది. పెరుగు వల్ల ముఖంపై మచ్చలు, మరకలు తొలగిపోతాయి. ఇంకా సులభంగా చెప్పాలంటే డీప్ క్లీన్సింగ్ అవుతుంది.
Also read: Ys Sharmila: వైఎస్ షర్మిల కుమారుడి పెళ్లి ఫిబ్రవరి 17న, ప్రకటించిన వైఎస్ షర్మిల, జగన్ హాజరయ్యేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Winter Skin Care: పెరుగులో ఇది కలిపి రాస్తే మిళమిళ మెరిసే అందం మీ సొంతం