Winter Beauty Tips: శీతాకాలంలో వాతావరణంలో తేమ పరిమాణాలు ఒక్కసారిగా పెరిగిపోవడం వల్ల చాలా మందిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ముఖంపై మెరుపు తగ్గి..చర్మం పొడిబారడం ప్రారంభమవుతుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన మాయిశ్చరైజర్‌లను వినియోగిస్తున్నారు. వీటిని వాడడం వల్ల చలి కాలంలో చర్మం మరింత అందగహీనంగా తయారవుతోంది. అయితే మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా సౌందర్య నిపుణులు సూచించిన సూచనలు, సలహాలు తప్పకుండా తెలుసుకోండి.
శీతాకాలంలో చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడే వారు తప్పకుండా ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా వీటిని వినియోగించడం వల్ల చర్మం మెరిసిపోతుంది. అంతేకాకుండా చర్మం పొడిబారడం తగ్గుతుంది.
1. టవల్ వినియోగించడం మానుకోండి:
ప్రస్తుతం చాలా మంది శీతాకాలంలో స్నానం చేసిన తర్వాత టవల్‌తో శరీరాన్ని గట్టిగా రుద్దుతారు. ఇలా రుద్దడం వల్ల చర్మం పొడిబారుతుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా చర్మం నల్లగా తయారయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.
2. శరీర నూనెతో మసాజ్ చేయండి:
చలి కాలంలో స్నానం చేసిన తర్వాత నూనెను రాసుకోవడం చాలా మంచిదని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నూనె చర్మంపై సహజమైన మెరుపును కూడా పెంచేందుకు కూడా సహాయపడుతుంది. కాబట్టి తప్పకుండా చలి కాలంలో తప్పకుండా చర్మానికి నూనెను అప్లై చేయాలి.
3. మాయిశ్చరైజ్ చేయండి:
స్నానం చేసిన తర్వాత మీ శరీరం తేమగా ఉండడానికి మెయింటెయిన్ వినియోగించాల్సి ఉంటుంది. దీని కోసం మార్కెట్‌లో లభించే ఆర్గానిక్ మాయిశ్చరైజర్ వినియోగించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల శరీరం హైడ్రేటింగ్‌గా మారుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Winter Beauty Tips: చలి కారణంగా చర్మం పొడిబారుతుందా?, ప్రతి రోజు ఇలా చేయకండి!