Why Hindus don't cut hair on Tuesday and why saloon shops are closed on the Tuesday check this scientific reasons: హిందూ సంప్రదాయంలో చాలా ఆచారాలు ఉంటాయి. ముఖ్యంగా మంగళవారం (Tuesday) గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం చెడు సంకేతంగా భావిస్తారు. ఇలా చేయడం మంచిది కాదని చెప్తుంటారు. అయితే దీనికి మూలం ఏమిటనేది చాలా మందికి తెలియదు. కానీ మనదేశంలో చాలా మంది ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక మంగళవారం రోజు ఎవరూ కటింగ్, (haircut) షేవింగ్ వంటివి చేయించుకోకపోవడం వల్ల ఆ రోజు క్షౌరశాలలకు ఎలాంటి గిరాకీ ఉండదు. అందుకే మంగళి షాప్‌లు.. మంగళవారాల్లో మూసి వేస్తుంటారు. అందుకే మంగళవారం మనకు ఏ బార్బర్ షాప్ (barber shop) కూడా తెరుచుకోదు. ఆ రోజు బార్బర్స్.. హాలీడే కింద రెస్ట్ తీసుకుంటూ ఉంటారు.
మంగళవార్ లేదా మంగళవారం అంగారక గ్రహం లేదా మంగళ గ్రహం (Mars or Mangal) ద్వారా పాలించబడుతుంది. మార్స్ లేదా అంగారక గ్రహం అనేది ఎరుపువర్ణానికి చిహ్నం. ఇది ఎక్కువ వేడి కలది. అయితే మార్స్ (Mars).. మానవ శరీరంపై ప్రభావాన్ని చూపుతుందంటారు. రక్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుందంటారు. అలాగే శరీరంపై గాట్లుపడడానికి, గాయాలు కావడానికి ఈ గ్రహ ప్రభావం ఉంటుందంటారు. అంతేకాదు.. అనవసరమైన తగాదాలు తెచ్చి పెడుతుందని నమ్ముతారు. లేనిపోని ఇబ్బందులను సృష్టిస్తుందని భావిస్తారు. కాబట్టి అంగారక గ్రహ ప్రభావం ఎక్కువగా ఉండే మంగళవారం రోజు హెయిర్ కటింగ్, షేవింగ్ వంటివి చేయించుకోకూడదు అంటారు. అలా చేస్తే ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని హిందూసంప్రదాయ విశ్వాసం.
Also Read : Shalimar Bagh Incident: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం.. ముగ్గురు మహిళలపై కర్రలతో దాడి
ఇక హిందూ సంప్రదాయంలో దుర్గాదేవిని (Maa Durga), మహాలక్ష్మి (Mahalakshmi) అమ్మవారిని మంగళవారం ఎక్కువగా పూజిస్తారు. మంగళవారం నాడు ఈ అమ్మవార్లను పూజించడం వల్ల అదృష్టం, ధనప్రాప్తి కలుగుతుందని భావిస్తారు. మంగళవారాన్ని (Tuesday)..మంగళ్ వార్ (Mangal Var) అంటే పవిత్రమైన రోజుగా హిందూ సంప్రదాయంలో విశ్వసిస్తారు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం.. శుభ దినాల్లో, పండుగ రోజుల్లో (festivals) గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేయరు. ఎందుకంటే అలాంటివి అశుభానికి (inauspicious) సూచనలు.ఇక చాలా ఇళ్లలో మంగళవారం నాడు (Tuesday) ఇంట్లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్తను కానీ ఇంటిని పూర్తిగా శుభ్రపరచడం వంటి పనులు కూడా చేయరు. బూజు దులపడం వంటి పనులు అస్సలు చేయరు.
Also Read : LPG gas cylinder price hike: భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు.. ప్రస్తుతం ఎంతంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook