Tulsi Leaves For White Hair To Black Hair: జుట్టు పొడవుగా, అందంగా కనిపించేందుకు చాలా మంది మార్కెట్‌లో లభించే రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తూ ఉంటారు. అంతేకాకుండా వివిధ చికిత్సలు కూడా చేయించుకుంటున్నారు. అయినప్పటికీ మంచి ఫలితాలు పొందలేకపోతున్నారు. వాతావరణ కాలుష్య, శరీరంలో పోషకాల కారణంగా జుట్టు తరచుగా రాలిపోవడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన తులసి ఆకులతో తయారు చేసిన రెమెడీని వినియోగించాల్సి ఉంటుంది. తులసిలో ఉండే ఔషధ గుణాలు అన్ని రకాల వ్యాధులకు ప్రభావంతంగా సహాయపడుతుంది. దీంతో పాటు జుట్టు సమస్యలను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది. అయితే జుట్టుకు తులసిని ఎలా వినియోగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తులసి మిశ్రమాన్ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
❁ తులసి ఆకులు
❁ పెరుగు
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
పెరుగులో జుట్టుకు కావాల్సిన ప్రోటీన్, జింక్, కాల్షియం అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని జుట్టుకు వినియోగించడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. తలలో ఉండే గుణాలు జుట్టులోని మురికి శుభ్రం చేసేందుకు కూడా సహాయపడతాయి. కాబట్టి ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా వినియోగించాల్సి ఉంటుంది.
తులసి ఆకు మిశ్రమ ప్రయోజనాలు:
✤ తులసి ఆకులు స్కాల్ప్ నుంచి జుట్టు పొడవుగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది.
✤ వాతావరణం మారడం కారణంగా వచ్చే హెయిర్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
✤ నిర్జీవమైన జుట్టుకు సరైన పోషణ అందించేందుకు సహాయపడుతుంది.
✤ జుట్టు రాలడాన్ని తగ్గించేందుకు కూడా దోహదపడుతుంది.
✤ పాడైపోయిన జుట్టును తిరిగి రిపేర్ చేస్తుంది.
జుట్టుకు తులసి, పెరుగు మిశ్రమాన్ని ఎలా వినియోగించాలో తెలుసా?:
✾ ముందుగా కప్పు తులసి ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.
✾ ఆ తర్వాత ఇందులో నీటిని వేసుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మరిగించాలి.
✾ ఆ నీటిని ఫిల్టర్ చేసి ఓ బౌల్‌లో పక్కన పెట్టాల్సి ఉంటుంది.
✾ ఈ తులసి ఆకులను మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేయాలి.
✾ అందులోనే పెరుగును మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి.
✾ ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 1 గంట పాటు అలాగే ఉంచుకోవాలి.
✾ తర్వాత సాధరణ షాంపూతో జుట్టును శుభ్రం చేయాలి.
✾ ఈ హోం రెమెడీని వారానికి 2 సార్లు వినియోగిస్తే మంచి ఫలితాలు పొందుతారు.
ఇది కూడా చదవండి : Kamareddy Politics: కామారెడ్డి రాజకీయాల్లో పొలిటికల్ టెన్షన్.. కేసీఆర్ ప్రత్యర్థులు అటెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
White Hair To Black Hair: తులసి ఆకులతో కూడా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది..ఈ రెమెడీని ఎప్పుడైనా వినియోగించారా?