White Hair Problem: ప్రస్తుతం చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయి. అంతేకాకుండా జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా సర్వసాధరణమవుతున్నాయి. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విటమిన్ లోపం, ఎక్కువగా స్మోకింగ్ చేయడం, జన్యు పరంగా తెల్ల జుట్టు సమస్యలు వస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఇలాంటి సమస్యలు ఒత్తిడి కారణంగా కూడా వస్తున్నాయి. కాబట్టి తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి నియమాలు పాటించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టు రాకుండా ఉండడానికి సహజ చిట్కాలు:
తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి మార్కెట్‌లో చాలా రకాల రసాయనాలతో కూడా ప్రోడక్ట్స్ ఉన్నాయి. వీటిని వినియోగించడం వల్ల తీవ్ర జుట్టు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఈ చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది.
కరివేపాకు:
తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కరివేపాకు ప్రభావవంతంగా సహాయపడుతుంది. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమేకాకుండా జుట్టును నల్లగా చేయడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలతో బాధపడడానికి తప్పకుండా ఆహారాల్లో కరివేపాకును వినియోగించాల్సి ఉంటుంది.
Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్, బీపీకి శాశ్వతంగా చెక్!
భృంగరాజ్:
భృంగరాజ్‌లో చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి సులభంగా జుట్టు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. దీని కోసం భృంగరాజ్‌తో తయారు చేసిన నూనెను జుట్టుకు వినియోగించాల్సి ఉంటుంది.
ఉసిరి:
ఉసిరిలో తీవ్ర అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధ గుణాలు లభిస్తాయి. అయితే తెల్ల జుట్టును తగ్గించడానికి కూడా ఉసిరి ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఆయుర్వేద గుణాలు చాలా రకాల జుట్టు సమస్యలను తగ్గించడమేకాకుండా మధుమేహాన్ని కూడా సులభంగా తగ్గిస్తుంది. కాబట్టి తప్పకుండా ఉసిరి ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది.
బ్లాక్ టీ:
తెల్ల జుట్టును నల్లగా చేయడానికి బ్లాక్ టీ కూడా ప్రభావవంతంగా సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడమేకాకుండా ఒత్తిడిని కూడా నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ 2 నుంచి 3 సార్లు బ్లాక్ టీని తాగాల్సి ఉంటుంది.
Also Read: Cholesterol Levels: ఎలాంటి ఖర్చు లేకుండా ఈ పువ్వు టీతో కొలెస్ట్రాల్, బీపీకి శాశ్వతంగా చెక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
White Hair Problem: తెల్ల జుట్టు వస్తుందా? ఇలా చేస్తే శాశ్వతంగా 7 రోజుల్లో మాయం!