Weight Loss Tips: ఆధునిక జీవనశైలి, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, ఒత్తిడి ఇలా వివిధ కారణాలతో అధిక బరువు ఓ పెను సమస్యగా మారిపోయింది. బరువు తగ్గించుకునేందుకు చాలా రకాలుగా ప్రయత్నించి విఫలమౌతుంటారు. ఈ క్రమంలో పచ్చి పలావు ఆకులు లేదా బే లీవ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. ఆ ఆకులతో కలిగే ఇతర ప్రయోజనాలు కూడా చూద్దాం..
బే లీవ్స్ లేదా పలావు ఆకులనేవి ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా లభిస్తాయి. ఎందుకంటే ఈ ఆకుల్ని టీ, కూరలు, బిర్యానీ, పలావులో రుచి కోసం విస్తృతంగా వినియోగిస్తుంటారు. అయితే ఈ ఆకులు కేవలం రుచి కోసమే కాకుండా..అధిక బరువు నుంచి ఉపశమనం పొందేందుకు కూడా దోహదపడతాయి. స్థూలకాయంతో సతమతమయ్యేవారు..బరువు తగ్గించుకునేందుకు సహజ పద్ధతి కోసం ఆలోచిస్తుంటే ఇదే సరైన ప్రత్యామ్నాయం. పలావు ఆకుల నీళ్లు తాగడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. స్థూలకాయం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకుల నీళ్లతో శరీరానికి కలిగే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం..బరువు తగ్గేందుకు ఈ ఆకులు ఎలా ఉపయోగపడతాయో చూద్దాం..
బరువు తగ్గించేందుకు , కొవ్వు కరిగించేందుకు 12 పలావు ఆకుల్ని ఓ గ్లాసు వేడినీళ్లలో వేసి బాగా ఉడికించాలి. ఆ తరువాత చల్లారిన తరువాత ఆ నీటిలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగాలి.
పలావు ఆకుల నీళ్లు తాగడం వల్ల బాడీ మెటబాలిజం బూస్ట్ అవుతుంది. పలావు ఆకుల నీళ్లలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఈ ఆకుల్లో ఉండే ఫైబర్ గుణాలు జీర్షక్రియను మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే కాల్షియం కొవ్వు కరిగించేందుకు దోహదపడుతుంది.
Also read: Skin Care Tips: రాత్రి నిద్రించేముందు ఇలా చేస్తే చాలు, డ్రై స్కిన్ సమస్య దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook