Simple Weight Loss Tips: వారం రోజుల్లో శరీర బరువు తగ్గించే ఓమ నీరు

Weight Loss with Ajwain Water: ఇటీవలి కాలంలో అధిక బరువు సమస్య చాలా అధికంగా కన్పిస్తోంది. ఆధునిక జీవన విధానంలో స్థూలకాయం పెను సవాలుగా మారుతోంది. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ విఫలమౌతుంటారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2023, 03:01 PM IST
Simple Weight Loss Tips: వారం రోజుల్లో శరీర బరువు తగ్గించే ఓమ నీరు

Simple Weight Loss Drinks: స్థూలకాయానికి చెక్ పెట్టేందుకు లేదా అధిక బరువును తగ్గించేందుకు వ్యాయామం, డైటింగ్ ఒక్కటే సరిపోదు. డైట్‌లో కొన్ని పదార్ధాలు చేర్చాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అందులో కీలకమైంది, అతి ముఖ్యమైంది వాము. వెయిట్ లాస్ ప్రక్రియలో వాము కీలకంగా ఉపయోగపడుతుంది.

వాము దాదాపుగా అందరి ఇళ్లలో ఉంటుంది. వాముతో ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. కానీ వాము నీళ్లతో అధిక బరువు తగ్గించుకోవచ్చని చాలామందికి తెలియదు. సాధారణంగా వామును వంటల్లో రుచి కోసం వాడుతుంటారు. లేదా తాలింపులో వినియోగిస్తుంటారు. వాములో పోషకాలు చాలా ఉంటాయి. ఇందులో ఐరన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇవి శరీరంలో షుగర్ నియంత్రణకు దోహదపడతాయి. ఇమ్యూనిటీ కూడా పటిష్టమౌతుంది. అందుకే రోజూ వాము నీళ్లు తాగడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు దూరమౌతాయి. వాము నీళ్లతో బరువు ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం..

వాము నీళ్ల ప్రయోజనాలు

జీర్ణక్రియ మెరుగుదల

వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా చాలామందికి జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో జీర్ణక్రియను మెరుగుపర్చేందుకు వాము నీళ్లు తాగాల్సి ఉంటుంది. ఇందులో లిక్విఫైడ్ పైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వాము నీళ్లు తాగడం ద్వారా గ్యాస్, మలబద్ధకం వంటి చాలా సమస్యల్ని తగ్గించవచ్చు. రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము.

బరువు తగ్గడం

ఒకవేళ మీ శరీర బరువు తగ్గించుకోవాలనుకుంటే..రోజూ పరగడుపున వాము నీళ్లు తాగడం చాలా మంచిది. వాము నీళ్లు తాగడం వల్ల బరువు చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. వాము నీళ్లతో ఆకలి తగ్గుతుంది. అనవసర తిండికి దూరంగా ఉంటారు. దాంతో బరువు క్రమ క్రమంగా తగ్గుతారు. అయితే దీనికోసం ప్రతిరోజూ వాము నీళ్లు తాగాల్సి ఉంటుంది.

ఇమ్యూనిటీ 

వాము నీళ్లు తాగడం వల్ల శరీరం రోగ నిరోధక శక్తి పటిష్టమౌతుంది. ఎందుకంటే ఇందులో ఉండే పోషకాలు చాలా వ్యాధుల సంక్రమణ నుంచి కాపాడుతాయి. అందుకే ప్రతిరోజూ వాము నీళ్లు డైట్‌లో భాగంగా చేసుకుని తాగాలి. వాము నీళ్లు చేయడం కూడా చాలా సులభం. ఓ గ్లాసు నీళ్లలో అరచెంచా వాము వేసి బాగా మరిగించాలి. చల్లారిన తరువాత వడకాచి తాగడమే. కొద్దిగా నిమ్మరసం వేసుకున్నా బాగుంటుంది. 

Also Read: Summer Drinks: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ 5 డ్రింక్స్ తప్పకుండా తీసుకోవల్సిందే

Also Read: Rohit Sharma-Virat Kohli: కేవలం 2 రన్స్ మాత్రమే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న రోహిత్-కోహ్లీ!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News